హరీష్ శంకర్ దర్శకత్యంలో వాల్మీకి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 6న రిలీజ్ చేద్దామనుకున్నారు… కానీ అయితే మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చారు. సెప్టెంబర్ 13వ తేదీకి మార్చారు. అయితే మళ్ళీ ఏమైందో తెలియదు కానీ రిలీజ్ డేట్ మార్చారు. వారం రోజులు వాయిదా వేశారు. సెప్టెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. ఇక సెప్టెంబర్ 13వ తేదీన గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాహో మేనియా సెప్టెంబర్ 13 వరకు కొనసాగే అవకాశం ఉండటంతో ఆ రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తే థియేటర్ల సమస్య కూడా వస్తుందని భావిస్తున్నారు. అందుకే గ్యాంగ్‌లీడర్‌ను ముందుగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేసి వాల్మీకిని 20న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఈ రోజు అధికారిక ప్రకటన చేశారు.
కాగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రను పోషిస్తున్నాడు. 14రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ బాణీలు సంగీతం అందిస్తున్నారు. మరి మొదటిసారి వరుణ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అందుతుందో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























