సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ తో పాటు దామిని చోప్రా అనే మరో బ్యూటీ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకరు యాక్షన్ తో ఆకట్టుకుంటే మరొకరు సినిమాలో గ్లామర్ తో రచ్చ చేయనున్నారన్నమాట. ఈ సినిమాలో ప్రభాస్ టీం లో టెక్ ఎక్స్పర్ట్ పోలీస్ గా ప్రీతీ అనే పాత్రలో నటిస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీ లో చదివిన దామిని చోప్రా అటు నటనతో పాటు పలు సామజిక పరిస్థితులపై ఆర్టికల్స్ రాయడమే కాదు.. పలు ఎన్జీవో సంస్థల్లో కూడా పని చేస్తూ తన వంతు తాను సాయం చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవల సాహో ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న దామిని పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. సాహూ మూవీలో నేను కూడా ఉండలనుకున్నాను.. ఆ తర్వాత నేను ఒక రోజు అనుకోకండా సుజిత్ ను కలవడం జరిగింది.. ఆ తర్వాత మాట్లాడటం సినిమాలో తీసుకోవడం జరిగిందని చెప్పింది. అంతేకాదు సెట్ లో వున్నప్పుడు తనను చాలా బాగా చూసుకున్నారని.. ఒక రకంగా చెప్పాలంటే యూవీ క్రియేషన్స్ నన్ను చాలా పాంపర్ చేశారని.. నిజానికి ప్రతి ఒక్కరూ ప్రభాస్ చాలా మంచి మనిషి అని అంటుంటారు.. కానీ తనతో మాట్లాడితే కానీ తెలుస్తుంది.. తాను ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడో.. ఎంత సిన్సియరో తెలుస్తుంది అని ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది.

అక్కడితో ఆగకుండా.. తనకు అల్లు అర్జున్ తో డాన్స్ చేయాలనీ ఉందని.. తన చిన్ననాటి క్రష్ నాగార్జునతో రొమాన్స్ చేయాలని తన మనసులో మాట చెప్పుకొచ్చింది. ఇక సాహో తర్వాత దామిని కి బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చినా తనకు తెలుగు ఇండస్ట్రీ లోనే ఉండాలని ఉందని.. ప్రభాస్ తో ఇంకా సినిమాలు చేయాలనీ పేర్కొంది. మరి సాహో తర్వాత దామిని కి మంచి మంచి ఆఫర్ లు వచ్చి తెలుగులో దూసుకుపోవాలని కోరుకుందాం..
కాగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, లాల్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మురళీ శర్మ, ముఖేష్ మంజ్రేకర్, మందిరా బేడీ ఇలా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన `సాహో` ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ అండర్ కవర్ పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































