`చిత్రలహరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత మెగా హీరో సాయితేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా `ప్రతి రోజూ పండగే`. సాయితేజ్‌కి జోడీగా రాశి ఖన్నా నటిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. మూడు తరాల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని… సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విడుదల తేదీకి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: