విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరో గా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్చన్ ఫిల్మ్ ‘డిస్కో రాజా’. గతంలో పలుమార్లు షూటింగ్ కి బ్రేక్ పడినట్లు పలురకాల రూమర్స్ వచ్చినప్పటికీ.. ఈ సినిమా ఇటీవల శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. నవంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. వినాయక చవితి పండుగ రోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఎస్ఆర్టీ ఎంటర్ టైన్మెంట్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
To All MassMaharaj Fans out there..
We are Happy to Announce That, First Look of #DiscoRaja On Sept 2nd on the eve of #VinayakaChavithi #DiscoRajaFLOnSept2nd@RaviTeja_offl @starlingpayal @vennelakishore @Tanyahopeoffl @NabhaNatesh @Dir_Vi_Anand @MusicThaman @itsRamTalluri— SRT Entertainments (@SRTmovies) August 28, 2019
ఇక సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో పాటు నాభా నటేష్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. ఇంకా సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి రవితేజ ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. మరి ఈ సినిమాతో రవితేజ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























