చిరంజీవి సినిమాల తేదీల‌ను టార్గెట్ చేసిన హ‌రీష్ శంక‌ర్‌

2019 Latest Telugu Film News, Hari Shankar Eyes on Chiranjeevi Movies Release Dates, Chiranjeevi Movies Release Dates, Chiranjeevi Latest Movie News, Hari Shankar Planning Based On Chiranjeevi Movies Release Dates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

`షాక్‌`(2006)తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన హ‌రీష్ శంక‌ర్‌… `మిర‌ప‌కాయ్‌` (2011)తో మొద‌టి విజ‌యాన్ని అందుకున్నాడు. అయితే… ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో రూపొందించిన `గ‌బ్బ‌ర్ సింగ్‌` (2012)తోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. క‌ట్ చేస్తే… ఇప్పుడు వ‌రుస‌గా మెగా కాంపౌండ్ హీరోల‌తో సినిమాలు చేస్తూ ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు హ‌రీష్‌. ఆ మ‌ధ్య‌ సాయితేజ్‌తో `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌` (2015), అల్లు అర్జున్‌తో `డీజే` (2017) రూపొందించిన హ‌రీష్‌… ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్‌తో `వాల్మీకి` తెర‌కెక్కిస్తున్నాడు. సెప్టెంబ‌ర్ 20న ఈ సినిమా తెర‌పైకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… గ‌తంలో మెగా హీరో సాయితేజ్‌తో హ‌రీష్ రూపొందించిన‌ `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌`… మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `ఠాగూర్‌`(2003) రిలీజ్ డేట్‌ (సెప్టెంబ‌ర్ 24)కి విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. క‌ట్ చేస్తే… ఇప్పుడు మ‌రో మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో హ‌రీష్ తెర‌కెక్కిస్తున్న‌ `వాల్మీకి` కూడా చిరు న‌టించిన హిట్ మూవీ `స్టాలిన్‌`(2006) విడుద‌లైన తేదిన‌ (సెప్టెంబ‌ర్ 20) రాబోతోంది.

మ‌రి… ‘ఠాగూర్’ విడుద‌ల తేదీ సాయితేజ్‌కు క‌లిసొచ్చిన‌ట్టుగానే… ‘స్టాలిన్’ రిలీజ్ డేట్ వ‌రుణ్‌కు కూడా అచ్చొస్తుందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − six =