మ్యూజిక‌ల్ హిట్‌ ‘శీను’కి 20 ఏళ్ళు

20 Glorified Years For Seenu Movie, 20 Years For seenu Movie, 2019 Latest Telugu Film News, Seenu Movie Latest News, Seenu Movie Telugu Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Venkatesh Musical Hit Seenu Completes 20 Years, Venkatesh Musical Hit Seenu Movie

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘శీను’ ఒకటి. ‘సూర్యవంశం’, ‘రాజా’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ‌లో వెంక‌టేష్ నటించిన సినిమా ఇది. తమిళ చిత్రం ‘సొల్లమాలే’కి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి శశి (`బిచ్చ‌గాడు` ఫేమ్‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బాలీవుడ్ బ్యూటీ ట్వింకిల్ ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఆనంద్‌, సుధాకర్, అలీ, బ్రహ్మానందం, చంద్రమోహన్, చారు హాస‌న్‌, బ్రహ్మాజీ, ఉత్తేజ్‌, వర్ష, శివ‌పార్వ‌తి తదితరులు ముఖ్య‌ భూమికలు పోషించారు. అందాల తార రాశి ప్ర‌త్యేక గీతంలో ద‌ర్శ‌న‌మిచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మెలోడీ బ్రహ్మ” మణిశర్మ స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. “ప్రేమంటే ఏమిటంటే”, “అల్లో నేరేడుకళ్ళ”, “ఏ కొమ్మకాకొమ్మ”, “ఏమని చెప్పను ప్రేమా”, “ఓ మనాలి”, “ఆటకుందో టైం” … ఇలా అన్ని పాట‌లు శ్రోత‌ల‌ను అల‌రించాయి. 1999 ఆగస్టు 27న విడుదలైన `శీను`… నేటితో 20 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.