‘వి ఎపిక్’ లో ప్రత్యేకతలు ఎన్నో

2019 Latest Telugu Film News, V Epiq Multiplex Special Features, Special Features of V Epiq Multiplex, Prabhas' V Epiq set to open, Features in V Epiq, prabhas V Epiq Multiplex, Prabhas Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
V Epiq Multiplex Special Features

భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్స్ తో తెరకెక్కిన ప్రభాస్ సాహో రిలీజ్ అవ్వడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే వుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఇప్పటికే సాహో తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ప్రభాస్ మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు. అయితే ఈసారి సినిమాతో కాదు.. ‘వి ఎపిక్’ థియేటర్ తో. యు.వి.క్రియేషన్స్‌ అధినేతల్లో ఒకరైన నెల్లూరుకు చెందిన వేమారెడ్డి వంశీ ప్రధాన భాగస్వామిగా ప్రభాస్ ఈ మల్టీప్లెక్స్‌ను భారీ ఎత్తున నిర్మించిన సంగతి తెలిసిందే. ‘వి ఎపిక్’ పేరుతో ఉన్నఈ మల్టీప్లెక్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సూళ్లురు పేటలో ప్రారంభం కానుంది. ‘సాహో’ సినిమాతోనే ‘వి ఎపిక్’ మల్టీప్లెక్స్ ఓపెన్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ థియేటర్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి..

* భారతదేశంలోనే కాకుండా .. ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్క్రీన్ ఉన్న థియేటర్‌ ఇదే.
* మూడు ఎకరాలో 3 స్క్రీన్ లతో ఈ థియేటర్ ను నిర్మించారు.
* వీటిల్లో ఒక స్క్రీన్ సైజు 100 అడుగుల ఎత్తు, 54 అడుగుల వెడల్పు. 656 మంది ఒకేసారి ఈ థియేటర్లో సినిమా చూడొచ్చు. 140 సీట్ల కెపాసిటీతో రెండు థియేటర్స్ నిర్మించారు.
* అత్యాధునిక సాంకేతికతను థియేటర్లలో వాడారు. 4కె రిజల్యూషన్ తో ప్రదర్శన వుంటుంది.
* 56కే లుమెన్స్ బ్రైట్ నెస్, 4కె బార్కో ఫ్లాగ్షిప్ లేజర్ ప్రొజెక్టర్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.