ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 13
దిగ్గజాలనే నడిపించిన సుజీత్ కు 'సాహో'
అజిత్ కు విలన్ గా అజయ్ దేవగన్..?

నాగార్జున విషయంలో ఎంత తప్పు చేశారు నాగేశ్వరరావు గారూ..!
శర్వా, రీతూ జంటగా కొత్త చిత్రం ప్రారంభం

అనుష్క లో నచ్చని ఒక క్వాలిటీ అదే..!

‘వి ఎపిక్’ లో ప్రత్యేకతలు ఎన్నో

బాలీవుడ్ లో బడా ఆఫర్ కొట్టేసిన కాజల్..!

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాగ్!?

`ప్రతి రోజూ పండగే`కి రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?

రామోజీ ఫిల్మ్ సిటీలో ‘వి’

చిరు ‘ఖైదీ’ బాటలోనే కార్తి `ఖైదీ`
కెరీర్ బెస్ట్ హిట్స్ తరువాత వస్తున్న టాలీవుడ్ స్టార్స్
గత చిత్రాలతో కెరీర్ బెస్ట్ హిట్స్ అందుకున్న కొందరు స్టార్ హీరోలు... 2019 చివరి నాలుగు నెలల్లో భారీ అంచనాల మధ్య తమ నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌తో సందడి చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

45 ఏళ్ళ కెరీర్‌ని పూర్తిచేసుకున్న నందమూరి బాలకృష్ణ
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం... ఇలా జానర్ ఏదైనా తన నటనాకౌశలంతో ప్రేక్షకులను మెప్పించారు, మెప్పిస్తున్నారు. అలాంటి బాలకృష్ణ నటప్రస్థానానికి బీజం వేసిన చిత్రం ‘తాతమ్మ కల’. తన తండ్రి, మహానటుడు యన్.టి.రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాల నటుడిగా (14 ఏళ్ళు) దర్శనమిచ్చారు బాలయ్య. తొలి చిత్రంతోనే అభినయానికి పుష్కలంగా అవకాశమున్న పాత్రలో నటించి ప్రశంసలు పొందారు.

బాబాయ్ హీరోయిన్‌తో అబ్బాయ్ ఆటాపాటా
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `ఎంత మంచివాడవురా`. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి `శతమానం భవతి` ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా... 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్లో సందడి చేసిన మూడు తరాల టాలీవుడ్ అగ్ర కథానాయకులు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సాహో’. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ రూపొందిన ఈ ట్రైలింగ్వల్ యాక్షన్ ఎంటర్టైనర్... ఈ రోజు (ఆగస్టు 30) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంతేకాదు... ఈ సినిమాతో ప్రభాస్ నేరుగా బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతుండడం విశేషం. అలాగే... తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు కూడా. ఆసక్తికరమైన అంశమేమిటంటే... ప్రభాస్ కంటే ముందు టాలీవుడ్‌కి చెందిన పలువురు అగ్ర కథానాయకులు హిందీనాట తమదైన ముద్ర వేశారు. మూడు తరాలకు చెందిన ఆ అగ్ర కథానాయకుల వివరాల్లోకి వెళితే...
రూ. వందల కోట్ల చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్
“చేసే పనిలో శ్రేష్టత, నిబద్ధత, క్రమశిక్షణ ఉంటే విజయం దానంతట అదే వరిస్తుంది” అనే మాటకు చిరునామాగా నిలుస్తారు ఎడిటర్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్. పలు జాతీయ, ప్రాంతీయ పురస్కారాలను అందుకున్న శ్రీకర్ ప్రసాద్... తెలుగు చిత్రం ‘సింహస్వప్నం’(1989)తో తొలి అడుగులు వేశారు. ఆపై పలు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, ఆంగ్ల చిత్రాలకు పనిచేశారు. అనేక బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో భాగమైన శ్రీకర్ ప్రసాద్... ప్రస్తుతం పలు భారీ బడ్జెట్ మూవీస్‌తో బిజీగా ఉన్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే... వీటిలో సింహభాగం రూ.వందల కోట్లతో రూపొందుతున్న సినిమాలే ఉన్నాయి.
దిగ్గజాలనే నడిపించిన సుజీత్ కు 'సాహో'
నిండా ముప్పై ఏళ్ళు లేవు.. తీసింది కేవలం ఒక్క సినిమా.. ఒక్క సినిమా తో బాహుబలిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. అంటే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది మనం చెప్పడం చాలా ఈజీగా చెప్పొచ్చు కానీ.. దానికి సుజీత్ పడిన కష్టం ఏంటో అతనికే తెలుస్తుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. తనకు సినిమాల పట్ల ఉన్న అంకిత భావమే సుజిత్ ను ఇప్పుడు ఈ స్థాయిలో కూర్చోబెట్టింది అని చెప్పొచ్చు. మొదట.. యూట్యూబ్ ఛానెల్పెట్టి.. షార్ట్ ఫిలిమ్స్ తీసి ఆ తర్వాత యువీ క్రియేషన్స్ పై 'రన్ రాజా రన్' సినిమాను తీసి మొదటి సినిమాతో హిట్ కొట్టి శర్వాకి లైఫ్ నిచ్చింది. ఊహించని లాభాలు తెచ్చింది. సుజిత్పై కాలుక్యులేషన్స్…
అజిత్ కు విలన్ గా అజయ్ దేవగన్..?
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'బద్లా' ను తమిళ్ లో 'నేర్కొండ పార్వాయ్' పేరుతో రీమేక్ చేసి ఇక్కడ కూడా హిట్ కొట్టాడు తమిళ్ తాలా అజిత్. హెచ్ వినోద్ డైరెక్టర్ గా, బోనీ కపూర్, అజిత్ కాంబినేషన్ లో ఈ నెల 18వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మరో సినిమా కూడా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జారుకుంటున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ లో ఈ సినిమా ను సెట్స్ పైకి తీసుకెళ్లే యోచనలో ఉన్నారట.
'మీకు మాత్రమే చెప్తా' ఫస్ట్ లుక్ రిలీజ్
తొలి సినిమా పెళ్లి చూపులు సినిమాతో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కు మంచి గుర్తింపు వచ్చింది. విజయ్ దేవరకొండ నిర్మాతగా.. 'ది కింగ్ ఆఫ్ హిల్స్' ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హీరో గా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిన్ననే ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఈరోజు తాజాగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఒక స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే లుక్ లో సెట్ చేసిన పోస్టర్ సరికొత్తగా ఉంది. ఇక మై బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్స్ అనే ట్యాగ్ తో తరుణ్ భాస్కర్ అలాగే మరోప్ ఇద్దరు కమెడియన్స్ మొబైల్స్ తో ఆశ్చర్యంగా ఇచ్చిన స్టిల్స్ చూస్తుంటే సినిమాలో కామెడీ డోస్ గట్టిగానే ఉంటుందని ఊహించవచ్చు.

నాగార్జున విషయంలో ఎంత తప్పు చేశారు నాగేశ్వరరావు గారూ..!
పరుగులు పెట్టటం కాలం నైజం. రోజులు, గంటలు, నిమిషాలు, క్షణాలుగా కరిగిపోయే కాలప్రవాహంలో మధుర క్షణాలుగా, మధురానుభూతులుగా నిలిచి పోయే సందర్భాలు, సంఘటనలు ఎవరి జీవితంలో ఎక్కువగా ఉంటాయో అవే వారి ఆనంద, ఆరోగ్య రహస్యాలు.
శర్వా, రీతూ జంటగా కొత్త చిత్రం ప్రారంభం
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రైతు సమస్యల నేపథ్యం లో ఎమోషనల్ డ్రామా శ్రీకారం మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దానితో పాటు 96 తమిళ సూపర్ హిట్ మూవీ రీమేక్ కూడా చేస్తున్నాడు. 96 సినిమా అయిపోయిన తర్వాత శ్రీకారం సినిమా చేయనున్నాడు.

ప్రభాస్ టీం లో టెక్ ఎక్స్పర్ట్ పోలీస్ గా దామిని చోప్రా..!
సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ తో పాటు దామిని చోప్రా అనే మరో బ్యూటీ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకరు యాక్షన్ తో ఆకట్టుకుంటే మరొకరు సినిమాలో గ్లామర్ తో రచ్చ చేయనున్నారన్నమాట. ఈ సినిమాలో ప్రభాస్ టీం లో టెక్ ఎక్స్పర్ట్ పోలీస్ గా ప్రీతీ అనే పాత్రలో నటిస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీ లో చదివిన దామిని చోప్రా అటు నటనతో పాటు పలు సామజిక పరిస్థితులపై ఆర్టికల్స్ రాయడమే కాదు.. పలు ఎన్జీవో సంస్థల్లో కూడా పని చేస్తూ తన వంతు తాను సాయం చేస్తుంది.

అనుష్క లో నచ్చని ఒక క్వాలిటీ అదే..!
ప్రభాస్, అనుష్క ఈ టాపిక్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ టాపిక్కే. బిల్లా సినిమా నుండి బాహుబలి వరకూ దాదాపు 10 ఏళ్ళ స్నేహం వీరిది. కానీ వీరిది స్నేహం కాదు.. అంతకుమించి ఏదో ఉందని అప్పటినుండి ఇప్పటివరకూ ఎన్నో వార్తలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు కాస్తా వెరీ పెళ్లి వరకూ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కి, అటు అనుష్క కి ప్రెస్ మీట్లలో వారి రిలేషన్ పై పలు ప్రశ్నలు ఎదురవ్వడం.. వాళ్ళు కూడా ఓపికగా సమాధానం చెప్పడం చూస్తూనే వున్నాం.

‘వి ఎపిక్’ లో ప్రత్యేకతలు ఎన్నో
భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్స్ తో తెరకెక్కిన ప్రభాస్ సాహో రిలీజ్ అవ్వడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే వుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఇప్పటికే సాహో తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ప్రభాస్ మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు. అయితే ఈసారి సినిమాతో కాదు.. ‘వి ఎపిక్’ థియేటర్ తో. యు.వి.క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైన నెల్లూరుకు చెందిన వేమారెడ్డి వంశీ ప్రధాన భాగస్వామిగా ప్రభాస్ ఈ మల్టీప్లెక్స్‌ను భారీ ఎత్తున నిర్మించిన సంగతి తెలిసిందే. ‘వి ఎపిక్’ పేరుతో ఉన్నఈ మల్టీప్లెక్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సూళ్లురు పేటలో ప్రారంభం కానుంది. ‘సాహో’ సినిమాతోనే ‘వి ఎపిక్’ మల్టీప్లెక్స్ ఓపెన్…

బాలీవుడ్ లో బడా ఆఫర్ కొట్టేసిన కాజల్..!
ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్నా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది టాలీవుడ్ చందమామ కాజల్. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరో పక్క వేరే భాషల్లో కూడా సినిమా ఛాన్సులు కొట్టేస్తుంది. ఇప్పటికే తను నటించిన హిందీ క్వీన్ రీమేక్ 'పారిస్ పారిస్' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇంకా కమల్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `భారతీయుడు2`లో నటిస్తోంది. ఇదీ కాక శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్యతో జతకట్టనుంది కాజల్.

'డిస్కో రాజా' ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరో గా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్చన్ ఫిల్మ్ 'డిస్కో రాజా'. గతంలో పలుమార్లు షూటింగ్ కి బ్రేక్ పడినట్లు పలురకాల రూమర్స్ వచ్చినప్పటికీ.. ఈ సినిమా ఇటీవల శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. నవంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాగ్!?
కామెడీ ఎంటర్టైనర్స్కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుల్లో గోపీచంద్ మలినేని ఒకరు. ‘డాన్ శీను’, ‘బాడీగార్డ్’, ‘బలుపు’ వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీస్‌తో అలరించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్... త్వరలో ‘కింగ్’ నాగార్జునతో జట్టుకట్టనున్నట్టు టాలీవుడ్ టాక్.

`ప్రతి రోజూ పండగే`కి రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?
`చిత్రలహరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత మెగా హీరో సాయితేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా `ప్రతి రోజూ పండగే`. సాయితేజ్‌కి జోడీగా రాశి ఖన్నా నటిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. మూడు తరాల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సత్యరాజ్, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రామోజీ ఫిల్మ్ సిటీలో ‘వి’
`అష్టా చమ్మా`, `జెంటిల్ మన్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత కథానాయకుడు నాని, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా `వి`. నాని సిల్వర్ జూబ్లీ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, అదితి రావ్ హైదరీ, నివేదా థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత `దిల్` రాజు ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

చిరు ‘ఖైదీ’ బాటలోనే కార్తి `ఖైదీ`
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం `ఖైదీ`. 1983లో విడుదలైన ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్... చిరు కెరీర్లో మైల్ స్టోన్‌గా నిలచిపోయింది. ఇంకా చెప్పాలంటే...`ఖైదీ`కి ముందు, `ఖైదీ`కి తరువాత అన్నంతగా ఆ సినిమా మెగాస్టార్ కెరీర్‌పై ప్రభావం చూపించింది.
రాధా కృష్ణ తరువాత ప్రభాస్ శ్రీకాంత్ అడ్డాలతో నా సినిమా..!
ప్రస్తుతం ప్రభాస్ సాహో ప్రమోషన్ లో బిజీ గా వున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ రేంజ్ సాహో సినిమాతో ఆ రేంజ్ మరింత పెరిగిపోయింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ కూడా ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది.