
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 11


‘ఆర్ ఆర్ ఆర్’ కోసం తారక్ సంచలన నిర్ణయం?

నాగ చైతన్య నటప్రస్థానానికి పదేళ్ళు

కథానాయకుడిగా నాని ప్రయాణానికి 11 ఏళ్ళు

ట్రెండింగ్ లో భరత్ అనే నేను మూవీ సీన్

బ్లాక్ బస్టర్ మూవీ ‘శభాష్ రాముడు’కు 60 ఏళ్ళు

2020 సంక్రాంతి కేరాఫ్ రీ-ఎంట్రీస్

బాలీవుడ్ లో 100 క్రోర్స్ క్లబ్ మూవీ

బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'నీకోసం'


సాహో నాలుగు రోజుల కలెక్షన్స్

సాహో దర్శకుడు సుజీత్ పాత జ్ఞాపకాలు
ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్
సాహో , ఎవరు మూవీస్ పై KTR ప్రశంసలు

ఒక్క రోజు గ్యాప్‌లో రానున్న ‘ఈగ’ స్టార్స్

పోరాట ఘట్టాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’
‘సరిలేరు నీకెవ్వరు’.... సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా... లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నారు.

‘ఆర్ ఆర్ ఆర్’ కోసం తారక్ సంచలన నిర్ణయం?
`బాహుబలి` సిరీస్ తరువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామా... తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఒకే రోజున విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది.

నాగ చైతన్య నటప్రస్థానానికి పదేళ్ళు
ఒకవైపు రొమాంటిక్, యాక్షన్ మూవీస్‌తో యువతను ఆకట్టుకుంటూనే... మరోవైపు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్‌తో కుటుంబ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ‘ఏమాయ చేసావె’, `ప్రేమమ్` లాంటి లవ్ స్టోరీస్ తోనూ.. ‘తడాఖా’ లాంటి యాక్షన్ మూవీస్ తోనూ... ‘100% లవ్’ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తోనూ.. ‘మజిలీ’, `రారండోయ్ వేడుక చూద్దాం` లాంటి కుటుంబ కథా చిత్రాలతోనూ... `మనం`లాంటి వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ... అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన వైనం ఈ అక్కినేని వారి మూడో తరం కథానాయకుడి సొంతం.

కథానాయకుడిగా నాని ప్రయాణానికి 11 ఏళ్ళు
`పక్కింటి అబ్బాయి` పాత్రలకు చిరునామాగా నిలచిన ఈ తరం కథానాయకుడు నాని. కేవలం ఆ తరహా భూమికలకే పరిమితం కాకుండా వైవిధ్యభరితమైన చిత్రాల్లోనూ భాగమవుతూ తన సహజ నటనతో నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు ఈ టాలెంటెడ్ యంగ్ హీరో. అంతేకాదు... హ్యాట్రిక్ విజయాలే కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో... డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించి ఈ తరం కథానాయకుల్లో ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు నాని. ఇక ఇటీవల విడుదలైన ‘జెర్సీ’తో నటుడిగా మరో మెట్టు ఎక్కి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

ట్రెండింగ్ లో భరత్ అనే నేను మూవీ సీన్
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన ప్రయాణీకులు ప్రమాదాల బారిన పడకుండా భారత దేశ ప్రభుత్వం భారీ జరిమానాలు విధించిన విషయం తెలిసిందే. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ గుర్తింపు పేపర్స్, అతి వేగం, ఓవర్ లోడ్ వంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారికి భారీ జరిమానాలు విధించమని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

బ్లాక్ బస్టర్ మూవీ ‘శభాష్ రాముడు’కు 60 ఏళ్ళు
మహానటుడు నందమూరి తారక రామారావు, లెజెండరీ డైరెక్టర్ సి.ఎస్.రావు కాంబినేషన్లో పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసాయి. వాటిలో ‘శభాష్ రాముడు’ ఒకటి. ఎన్టీఆర్, దేవిక నాయకానాయికలుగా నటించిన ఈ సినిమాలో... రమణమూర్తి, రేలంగి, కాంతారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఆర్.నాగేశ్వరరావు, గిరిజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వెంపటి సదాశివబ్రహ్మం కథను అందించగా... రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్‌లాల్ నహతా, టి.అశ్వద్ధనారాయణ సంయుక్తంగా నిర్మించారు. హిందీ చిత్రం ‘బడా భాయి’(1957)కి రీమేక్‌గా ‘శభాష్ రాముడు’ను రూపొందించారు దర్శకుడు సి.ఎస్.రావు.

సెప్టెంబర్ లో పాత టైటిల్స్‌తో కొత్త సినిమాల సందడి
పాత సినిమాల పేర్లతో కొత్త సినిమాలు తెరకెక్కడం అనాదిగా ఉన్న వ్యవహారమే. అయితే... ఒకే నెలలో వరుసగా మూడు వారాల పాటు ఇటువంటి టైటిల్స్‌తో సినిమాలు విడుదల కావడం అంటే... కచ్చితంగా వార్తల్లో నిలచే అంశమే. అలా... 2019 సెప్టెంబర్ టాలీవుడ్ కి ప్రత్యేకం కానుంది.

2020 సంక్రాంతి కేరాఫ్ రీ-ఎంట్రీస్
2020 సంక్రాంతికి పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే... వాటిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ మాత్రం ఎంతో ప్రత్యేకం కానున్నాయి. ఎందుకంటే... ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఆ యా సినిమాలతో నిన్నటి తరం అగ్ర కథానాయికలిద్దరు భారీ విరామం తరువాత తెలుగు తెరపై దర్శనమివ్వనున్నారు. వారిలో ఒకరు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాగా... మరొకరు టాలెంటెడ్ యాక్ట్రస్ టబు.

బాలీవుడ్ లో 100 క్రోర్స్ క్లబ్ మూవీ
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సాహో కలెక్షన్స్ రికార్డ్స్ పరంపర కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తం గా 5రోజులలో 350 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియా లో సాహో మూవీ హిందీ వెర్షన్ 5రోజులకు 102 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల క్లబ్ లో చేరింది. సాహో మూవీ లోని యాక్షన్ సీన్స్, అందమైన లొకేషన్స్ కు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు.
సెప్టెంబర్ 2019... దక్షిణాది అనువాద చిత్రాల సందడి
2019 సెప్టెంబర్‌లో... వరుసగా మూడు వారాల పాటు దక్షిణాది అనువాద చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధపడుతున్నాయి.

బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్
యు వి క్రియేషన్స్, టి - సిరీస్ బ్యానర్స్ పై యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ రిలీజయి కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మిక్స్డ్ టాక్ తో ప్రదర్శించబడుతున్న సాహో మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లు కలెక్ట్ చేసింది. బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తరువాత ఫస్ట్ డే కలెక్షన్స్ లో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా సాహో మూవీ నిలిచింది .

వాల్మీకి లో సర్ ప్రయిజ్ ఇవ్వనున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్..?
హరీష్ శంకర్ దర్శకత్యంలో వాల్మీకి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 6న రిలీజ్ చేద్దామనుకున్నారు... కానీ సాహో మేనియా వల్ల సెప్టెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'నీకోసం'
అవినాష్ కోకటి దర్శకత్వం లో అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారమ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా 'నీ కోసం'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా... దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను అందించింది.

పీటర్ హెయిన్స్ దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ ( బుజ్జి) నిర్మాతగా సినిమా!
పీటర్ హెయిన్స్... పరిచయం అక్కర్లేని పేరు. గౌతమ్ మీనన్ `చెలి`తో ఫైట్ మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో `మురారి`తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత `అపరిచితుడు`, `శివాజీ`, `గజిని`, `మగధీర`, `రోబో`, `విలన్`, `విక్రమ సింహ`, `బాహుబలి`, `మన్యం పులి`...ఇలా ఎన్నో సినిమాలకు ఆయన స్టంట్ మాస్టర్ గా పని చేసాడు. కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్లలోనే సౌత్ ఇండియాతో పాటు, బాలీవుడ్ సినిమాలకు యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసి ఓ బ్రాండ్‌గా ఎదిగారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కేటగిరీని తొలిసారి జాతీయ అవార్డుల్లో పొందుపరిచినప్పుడు, ఆ ఘనతను సొంతం చేసుకున్న యాక్షన్…

సాహో నాలుగు రోజుల కలెక్షన్స్
టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది సాహో సినిమా. సైలెంట్ పాయిజన్ లాగా ఎక్కుతూ.. కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. మొదటి రెండు రోజుల్లోనే రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సాహో నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ 67 కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. ఇక హిందీలో నాలుగో రోజు 14.20 కోట్ల గ్రాస్ ను కాలెక్ట్ చేసింది. మొత్తంగా హిందీ వర్షన్ నాలుగు రోజుల్లో రూ. 93.28 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి వరుసగా సెలవలు కూడా రావడంతో సాహో కు కూడా కలిసొచ్చింది. మరి ఈ సినిమా నాగులు రోజుల్లో ఏయే ఏరియాలో ఎంత కాలేచ్ట్ చేసిందో చూద్దాం.

సాహో దర్శకుడు సుజీత్ పాత జ్ఞాపకాలు
350 కోట్ల బడ్జెట్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ రిలీజయిన విషయం తెలిసిందే. టాక్ తో ప్రమేయం లేకుండా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతుంది. సాహో మూవీ పై , దర్శకుడు సుజీత్ పై క్రిటిక్స్ విమర్శల వర్షం కురిపించారు. బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రభాస్ వన్ మూవీ ఓల్డ్ దర్శకుడు సుజీత్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ప్రభాస్ ను పర్ఫెక్ట్ గా దర్శకుడు హ్యాండిల్ చేయలేదని అభిమానులు కూడా అసంతృప్తి కి గురయ్యారు.
ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ నిశ్శబ్దం మూవీ సియోటెల్ లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైకేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. తెలుగులో నిశ్శబ్దం, ఇతర భాషలలో సైలెన్స్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ పూర్తిగా US లో చిత్రీకరణ జరుపుకొనడం విశేషం.
సాహో , ఎవరు మూవీస్ పై KTR ప్రశంసలు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా సుజీత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషలో భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ భారీ అంచనాలతో ఆగస్ట్ 30వ తేదీ రిలీజయి మిశ్రమ స్పందన పొందింది. సాహో మూవీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. 3రోజులకు సుమారు 300 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘బంగారు బుల్లోడు’కు 26 ఏళ్ళు
నటసింహ నందమూరి బాలకృష్ణ పంచె కట్టుతో వెండితెరపై దర్శనమిచ్చిన చిత్రాల్లో సింహభాగం విజయం సాధించినవే కావడం విశేషం. అంతేకాదు... అలా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో పలు చిత్రాలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్గానూ అలరించాయి. అటువంటి సినిమాల్లో ‘బంగారు బుల్లోడు’ ఒకటి. బాలకృష్ణ సరసన రమ్యకృష్ణ, రవీనా టాండన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో... రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, శ్రీవిద్య, శరత్ సక్సేనా, దేవన్, దేవరాజ్, అన్నపూర్ణ, బ్రహ్మానందం, బాబూమోహన్, మాస్టర్ బాలాదిత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని... జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై…

ఒక్క రోజు గ్యాప్‌లో రానున్న ‘ఈగ’ స్టార్స్
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ‘ఈగ’ (2012)లో... కథానాయకుడిగా నేచురల్ స్టార్ నాని, ప్రతినాయకుడిగా కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ పోటీ పడి మరీ నటించిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే... ఆ సినిమాలో రైవల్స్‌గా నటించిన ఈ ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్... ఇప్పుడు ఒక రోజు గ్యాప్ లో తమ రాబోయే చిత్రాలతో సందడి చేయనున్నారు.