నాగ చైత‌న్య న‌ట‌ప్ర‌స్థానానికి ప‌దేళ్ళు

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, 10 Years For Naga Chaitanya In Tollywood, 10 Years For Naga Chaitanya In Tollywood, Naga Chaitanya Completes 10 years in TFI, Naga Chaitanya Latest Movie News, Naga Chaitanya 10 Glorified years In TFI, Naga Chaitanya Successful Journey In Tollywood

ఒక‌వైపు రొమాంటిక్, యాక్షన్ మూవీస్‌తో యువతను ఆకట్టుకుంటూనే… మరోవైపు ఫ్యామిలీ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్స్‌తో కుటుంబ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ‘ఏమాయ చేసావె’, `ప్రేమ‌మ్‌` లాంటి లవ్ స్టోరీస్ తోనూ.. ‘తడాఖా’ లాంటి యాక్షన్ మూవీస్ తోనూ… ‘100% లవ్’ లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ తోనూ.. ‘మజిలీ’, `రారండోయ్ వేడుక చూద్దాం` లాంటి కుటుంబ కథా చిత్రాల‌తోనూ… `మ‌నం`లాంటి వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌తోనూ… అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు చేరువైన వైనం ఈ అక్కినేని వారి మూడో త‌రం క‌థానాయ‌కుడి సొంతం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాంటి చైతూ చిత్ర‌యాత్ర‌లో తొలి అడుగు… ‘జోష్’(2009). తండ్రి నాగార్జున కెరీర్‌ని మేలి మ‌లుపు తిప్పిన‌ ‘శివ’ (1989) స్ఫూర్తితో తెర‌కెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో… మొద‌టి ప్ర‌య‌త్నంలోనే న‌టుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు చైతూ. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రంతో ఒక‌నాటి అందాల తార రాధ పెద్ద కుమార్తె కార్తీక నాయిక‌గా ప‌రిచ‌యం కాగా… వాసు వర్మ ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు. 2009 సెప్టెంబర్ 5న విడుద‌లైన `జోష్‌`… నేటితో ప‌ది వ‌సంతాలు పూర్తిచేసుకుంటోంది. అంటే… క‌థానాయ‌కుడిగా చైతు కెరీర్ మొదలై నేటితో ద‌శాబ్ద‌కాలం పూర్త‌వుతోందన్నమాట. ఈ సంద‌ర్భంగా… మున్ముందు చైతూ మ‌రిన్ని వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో ముందుకు సాగాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + twelve =