బచ్చల మల్లి షూటింగ్ కీలక అప్‌డేట్‌

Bachhala Malli Movie Team Wraps up Key Schedule

అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. హీరోగా ఆయనకిది 63వ సినిమా కావడం విశేషం. ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తుండగా.. ‘సామజవరగమన’ ఫేమ్ రాజేష్ దండా, బాలాజీ గుత్తాలు హాస్య మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్‌ వచ్చింది. ‘బచ్చల మల్లి’ చిత్రం కీలక షెడ్యూల్‌ను ముగించుకుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమా ఎలా రూపుదిద్దుకుంటుందనే దానిపై చిత్రబృందం ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘బచ్చల మల్లి’ చిత్రం యూనిక్‌ కాన్సెప్ట్‌తో 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామా పాయింట్‌తో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ‘హనుమాన్’ ఫేమ్ అమృత అయ్యర్‌ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేష్, రోహిణి, సాయికుమార్‌, కోట జయరామ్‌, హరితేజ, ప్రవీణ్, ధనరాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ‘మానాడు’, ‘రంగం’, ‘మట్టి కుస్తీ’ వంటి హిట్ సినిమాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్‌గా పని చేస్తున్నారు. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్‌గా సహకారం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్‌డ్‌ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 11 =