రౌడీహీరో విజయ్ దేవరకొండ కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఖుషి తో డీసెంట్ హిట్ ను అందుకోగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నందనందన అనే పాటను రిలీజ్ చేయగా పాట మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విజయ్ నటన, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ హైలెట్ గా నిలుస్తున్నాయి. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
Yevandi…#FamilyStarTeaser vachesindi… Chuseyandi 🤩
The most awaited #FamilyStarTeaser OUT NOW 🌟
▶️ https://t.co/LcJFIPvnXXIn cinemas on April 5th ❤️🔥#FamilyStar#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official… pic.twitter.com/4e1wGJfoBp
— Sri Venkateswara Creations (@SVC_official) March 4, 2024
కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: