మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయిందని ఇటీవల వార్తలు వచ్చాయి. వరుణ్ మార్కెట్ కన్నా సినిమా బడ్జెట్ ఎక్కువవుతుందని అందుకే ఆగిపోయిదంటూ ప్రచారం జరిగింది.అయితే ఈవిషయం లో నిర్మాతలు తాజాగా క్లారిటీ ఇచ్చారు.ఈసినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు.ఈరోజు ఆమె బర్త్ డే సందర్బంగా మట్కా నుండి పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు దాంతో సినిమా ఆగిపోయిందని వచ్చిన వార్తలకు చెక్ పెట్టినట్లైయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Team #Matka wishes the stunning actress @Meenakshiioffl a fabulous birthday ❤️🔥
Her enchanting aura will add a touch of magic to this earthy realm💥#HBDMeenakshiChaudhary
Mega Prince @IAmVarunTej @KKfilmmaker #NoraFatehi @gvprakash @kishorkumardop #KarthikaSreenivasR… pic.twitter.com/oOLasBvOQq
— Vyra Entertainments (@VyraEnts) March 5, 2024
పలాస ఫేమ్ కరణకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రలో నటిస్తుంది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటటైన్మెంట్స్,ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి.
ఇక వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ గా వుంది మీనాక్షి చౌదరి.ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం లో కనిపించిన మీనాక్షి ప్రస్తుతం మట్కా తోకలిపి నాలుగు సినిమాలు చేస్తుంది.అందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సరసన లక్కీ భాస్కర్ లోనటిస్తుంది.ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా.అలాగే విశ్వక్ సేన్ 10వ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా నటిస్తుంది.రవితేజ డైరెక్ట్ చేస్తుండగా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.వీటితో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలో ఓ హీరోయిన్ గా నటిస్తుంది.ఇవి కాకుండా మరిన్ని కొన్ని సినిమాలు చర్చల దశలో వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: