ఒకే ఒక జీవితంతో సూపర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో శర్వానంద్.ఈ హీరో త్వరలోనే తన 35వ సినిమాతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తుండగా శర్వా సరసన కృతి శెట్టి నటిస్తుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇక ఈసినిమాకు సంబందించిన అప్డేట్ వచ్చేసింది.అదేంటంటే ఈసినిమా మోషన్ పోస్టర్ ను రేపు విడుదలచేయనున్నారు.అందులో టైటిల్ ను కూడా రివీల్ చేయనున్నారు.మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Magic Begins Tomorrow! Big Ben will tell you the time of our grand reveal 🕰️. Look closely for the exact time! #Sharwa35 #HBDSharwa@ImSharwanand @SriramAdittya @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla #Kritiprasad @HeshamAWMusic @VishnuSarmaDOP @PrawinPudi… pic.twitter.com/epOtwcBFiQ
— People Media Factory (@peoplemediafcy) March 5, 2024
ఈసినిమాతోపాటు ప్రస్తుతం శర్వానంద్ మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.లూజర్ అనే వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి తో తన 36వ సినిమా చేస్తున్నాడు.ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుండగా యూవీ క్రీయేషన్స్ నిర్మిస్తుంది.అన్ని కుదిరితే ఈసినిమా కూడా ఈఏడాది లోనే విడుదలయ్యే ఛాన్స్ వుంది.
ఇక రీసెంట్ గా శర్వానంద్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.గత ఏడాది సామజవరగమన తో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన దర్శకుడు రామ్ అబ్బవరం చెప్పిన కథకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.దాంతో వీరి కాంబినేషన్ లో సినిమా ఖరారు అయ్యిందని టాక్.రేపు శర్వానంద్ బర్త్ డే సందర్భంగా ఈసినిమాను అధికారకంగా ప్రకటించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: