
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 148


లవ్ మీ ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్

సూర్య 43అతి త్వరలోనే

ఓమ్ భీమ్ బుష్ సెన్సార్ టాక్

కంగువ టీజర్ రిలీజ్.. ట్రైబల్‌గా అదరగొట్టిన సూర్య

ఉస్తాద్ భగత్ సింగ్- పవర్ ఫుల్ వీడియో రిలీజ్

టిల్లు స్క్వేర్ నుండి తప్పుకున్న తమన్

జపాన్‌లో రాజమౌళి క్రేజ్ చూస్తే.. మతి పోవాల్సిందే

బచ్చలమల్లి డిఫరెంట్ జోనర్ సినిమా

దూత సీక్వెల్ కు రెడీ

ఫైనల్లీ RC16 గ్రాండ్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
సైలెంట్ గా విజయాలను అందుకుంటూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు కుర్రహీరో సుహాస్. యూ ట్యూబ్ వీడియోల ప్రస్థానం నుండి ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హీరో అయ్యాడు. రీసెంట్ గానే అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. ఈసినిమాలో తన నటనతో మరో మెట్టు ఎక్కాడు సుహాస్. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

లవ్ మీ ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్
యంగ్ హీరో ఆశిష్ మాత్రం వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అందులో లవ్ మీ సినిమా కూడా ఒకటి. హార్రర్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమవుతుంది. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను చాలా సైలెంట్ గా మొదలుపెట్టి సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

సిటాడెల్ ఇండియన్ వెర్షన్ టైటిల్ రిలీజ్
రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఫ్యామిలీ మెన్ సిరీస్ తరువాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో సమంత తోపాటు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో వచ్చిన సిటాడెల్ కు హిందీ వెర్షనే అన్న సంగతి కూడా విదితమే. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో పడింది.

సూర్య 43అతి త్వరలోనే
స్టార్ హీరో సూర్య,లేడీ డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.వీరిద్దరి కాంబోలో ఇంతకుముందు సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా ) అనే సినిమా వచ్చింది.ఈసినిమా థియేటర్లలో విడుదలకాలేదు కానీ ఓటిటి లోమాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.విమర్శకుల ప్రశంసలు పొందడం తోపాటు పలు అవార్డులను కూడా ఖాతాలో వేసుకుంది.ఇక ఇప్పుడు మరో సారి వీరి కాంబినేషన్ అనే సరికి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.

ఓమ్ భీమ్ బుష్ సెన్సార్ టాక్
ఈవారం బ్రోచేవారెవరురా త్రయం శ్రీ విష్ణు,రాహుల్ రామకృష్ణ ,ప్రియదర్శి కలిసి నటించిన ఓం భీమ్ బుష్ థియేటర్లలోకి రానుంది.టీజర్,ట్రైలర్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది.నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే ట్యాగ్ తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఇక ఈసినిమాకు ఇన్సైడ్ రిపోర్ట్స్ అయితే షురూ షాట్ హిట్ అనేలా వున్నాయి.సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారట.కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని సినిమా అయితే హిలేరియస్ గా ఉందని అన్నారట.సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు.2గంటల 15నిమిషాల రన్ టైం తో రానుంది.

కంగువ టీజర్ రిలీజ్.. ట్రైబల్‌గా అదరగొట్టిన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. ప్రముఖ తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య నటించిన 'సింగం' సిరీస్‌కు దేవినే సంగీతం అందించిన విషయం తెలిసిందే.

గీతాంజలి మళ్లీ వచ్చింది నుండి నాన్న ఎమోషనల్ సాంగ్ రిలీజ్
అంజలి ప్రధాన పాత్రలో హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమా గీతాంజలి. 2014లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. దాదాపు 10 ఏళ్ల తరువాత ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమాను ముందు మార్చి 22వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు.. ఆతరువాత రిలీజ్ డేట్ ను మార్చారు. ఏప్రిల్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉస్తాద్ భగత్ సింగ్- పవర్ ఫుల్ వీడియో రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు, సుజీత్ దర్శకత్వంలో ఓజీ అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ఓజీ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. మిగిలిన రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇక పవన్ కూడా రాజకీయాలతో బిజీగా ఉండటంతో ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ పడింది.

టిల్లు స్క్వేర్ నుండి తప్పుకున్న తమన్
మచ్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఈనెల 29న థియేటర్లలోకి వస్తుంది.డీజే టిల్లు ఊహించని విధంగా సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ ఫై అంచనాలు భారీగా వున్నాయి.ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా హైప్ తగ్గేట్లే వుంది.ఈసినిమాకు రామ్ మిరియాల,అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.ఇంతకుముందు విడుదలచేసిన రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా నిన్న మూడో సాంగ్ ఓ మై లిల్లీని రిలీజ్ చేశారు.

జపాన్‌లో రాజమౌళి క్రేజ్ చూస్తే.. మతి పోవాల్సిందే
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అంటే ఇండియాలో తెలియని వారుండరు. అయితే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాల తర్వాత ఆయన పేరు విదేశాల్లో సైతం మారుమ్రోగిపోతోంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి అమెరికా సహా పాశ్చాత్య దేశాల్లో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇక జపాన్ దేశంలో అయితే.. రాజమౌళి క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే. తాజాగా జపాన్‌లో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడి ప్రజలు ఆయనపై అపార అభిమానాన్ని ప్రదర్శించారు. తమవాడిగా భావించిన జపాన్ దేశస్తులు రాజమౌళికి ఘన స్వాగతం పలికారు.

టిల్లు స్క్వేర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది డీజే టిల్లు సినిమా. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈసినిమాలోని డైలాగ్స్, సాంగ్స్, టిల్లు యాటిట్యూడ్ అన్నీ సినిమాకు హైలెట్ నిలిచి సంచలన విజయం అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా సిద్దూ నటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఓటీటీలో కూడా హనుమాన్ రికార్డ్స్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి.ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగించింది.

మహేష్ బాబు సినిమాపై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమాను ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా రాజమౌళి ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. జపాన్‌లో అయితే ఈ చిత్రం రిలీజై 500 రోజులకుపైనే అవుతున్నా.. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా నడుస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో రాజమౌళి ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ దేశం వెళ్లారు.

టిల్లు స్క్వేర్ నుండి ఓ మై లిల్లీ ఫుల్ సాంగ్ రిలీజ్
సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం వల్ల ఈసినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఫైనల్ గా అయితే ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మరింత క్రేజ్ ను పెంచుతున్నారు.

బచ్చలమల్లి డిఫరెంట్ జోనర్ సినిమా
పంపిణీదారుని కంటే నిర్మాతగా ప్రయాణం బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతగా వుందని సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా తెలియజేస్తున్నారు. నేను పంపిణీదారుడిగా వున్నప్పుడే సందీప్ కిషన్, అల్లరి నరేష్ నన్ను నమ్మారు. అలా నాతో జర్నీ చేస్తున్నారు. వారితో మరలాసినిమాలు తీయడానికి కారణమదే అంటూ హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండా అన్నారు. మార్చి 19 న రాజేష్ దండా పుట్జినరోజు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేష్ దండా తన నిర్మాణంలోనూ, భవిష్యత్ సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

ఆయ్ నుండి సూఫియానా మెలొడీ సాంగ్ ప్రోమో రిలీజ్
అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆయ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. టైటిల్, ఫస్ట్ లుక్ తోనే ఈసినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

తమిళనాడులో ఆల్ టైం రికార్డు సృష్టించిన మలయాళ సినిమా
తమిళనాడు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది మలయాళ సినిమా మంజుమ్మెల్ బాయ్స్.ఈసినిమా నిన్నటి తో అక్కడ 50కోట్ల మార్క్ ను చేరుకుంది దాంతో అత్యధిక వసూళ్లను రాబట్టిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది.అంతేకాదు కేవలం మలయాళ వెర్షన్ ద్వారానే ఈ ఫీట్ సాధించింది.ఇక తమిళనాడు లో ఇంతకుముందు కేవలం 5 పరభాషా సినిమాలు మాత్రమే 50కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి.అందులో బాహుబలి ,బాహుబలి 2 ,ఆర్ఆర్ఆర్,కెజిఎఫ్2,అవతార్ 2 సినిమాలు ఉండగా తాజాగా మంజిమ్మెల్ బాయ్స్ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.

దూత సీక్వెల్ కు రెడీ
అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు నాగచైతన్య. ఇప్పుడు నాగ చైతన్య కూడా విభిన్నమైన సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక సినిమాలతో పాటు నాగ చైతన్య వెబ్ సిరీస్ లలో కూడా చేసి హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే కదా. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ప్రధాన పాత్రలో వచ్చిన వెబ్ సిరీస్ దూత. హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ గత ఏడాది డిసెంబర్ 1 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈవెబ్ సిరీస్ మంచి హిట్ టాక్ నే అందుకుంది.

తెలుగులో ప్రేమలు రికార్డు కలెక్షన్స్
ప్రేమలు తెలుగులో ఇంతకుముందు ఏ మలయాళం సినిమా సృష్టించని రికార్డు క్రియేట్ చేసి చరిత్ర సృష్టించింది.శివరాత్రికి ఈసినిమా తెలుగులో విడుదలకాగా రివ్యూస్ పాజిటివ్ గా వచ్చాయి అయితే డబ్బింగ్ సినిమాకుతోడు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో మొదటి రోజు అంతంతమాత్రంగానే కలెక్షన్స్ ను రాబట్టింది.ఆతరువాత మాత్రం ఎక్స్ట్రార్డినరీ మౌత్ టాక్ వల్ల రోజు రోజు కి కలెక్షన్స్ ను పెంచుకుంటూపోయింది.మొదటి వీకెండ్ కన్నా సెకండ్ వీకెండ్ ఎక్కవ కల్లెక్షన్స్ ను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.