దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

suhas movie in dil raju productions release date update

సైలెంట్ గా విజయాలను అందుకుంటూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు కుర్రహీరో సుహాస్. యూ ట్యూబ్ వీడియోల ప్రస్థానం నుండి ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హీరో అయ్యాడు. రీసెంట్ గానే అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. ఈసినిమాలో తన నటనతో మరో మెట్టు ఎక్కాడు సుహాస్. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాటిలో దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా కూడా ఒకటి. దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న నాలుగో ప్రాజెక్ట్ ఇది. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కూడా. ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాను మే 24వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు టైటిల్ ను కూడా త్వరలో ప్రకటిస్తామని తెలియచేశారు.

కాగా సందీప్ రెడ్డి బండ్ల‌ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో సంకీర్త‌న విపిన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా.. రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, గోప‌రాజు, ర‌ఘుబాబు, పృథ్వీ, శివ‌న్నారాయ‌ణ‌, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ పై వస్తున్న ఈసినిమాను హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ: సాయిశ్రీరామ్‌, సంగీతం: విజ‌య్ బుల్గానిన్‌ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.