ప్రేమలు తెలుగులో ఇంతకుముందు ఏ మలయాళం సినిమా సృష్టించని రికార్డు క్రియేట్ చేసి చరిత్ర సృష్టించింది.శివరాత్రికి ఈసినిమా తెలుగులో విడుదలకాగా రివ్యూస్ పాజిటివ్ గా వచ్చాయి అయితే డబ్బింగ్ సినిమాకుతోడు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో మొదటి రోజు అంతంతమాత్రంగానే కలెక్షన్స్ ను రాబట్టింది.ఆతరువాత మాత్రం ఎక్స్ట్రార్డినరీ మౌత్ టాక్ వల్ల రోజు రోజు కి కలెక్షన్స్ ను పెంచుకుంటూపోయింది.మొదటి వీకెండ్ కన్నా సెకండ్ వీకెండ్ ఎక్కవ కల్లెక్షన్స్ ను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్న ఈసినిమా అత్యధిక వసూళ్లను రాబట్టుకుంది.నిన్న ఒక్క రోజే 2కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది దాంతో 10 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 10.54కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.అంతేకాదు తెలుగులో అత్యధిక వసూళ్లను రాబట్టిన మొదటి మలయాళ డబ్బింగ్ సినిమాగా ప్రేమలు రికార్డు క్రియేట్ చేసింది.కేవలం 2కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటివరకు నాలుగు కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది.ఫుల్ రన్ మరో రెండు లేదా మూడుకోట్ల వసూళ్లను రాబట్టుకోనుంది.
టిల్లు స్క్వేర్ వచ్చే వరకు ప్రేమలు డ్రీం రన్ ను కొనసాగించనుంది.అటు మలయాళంలో కూడా ప్రేమలు జోరు ఇంకా తగ్గలేదు.ఆరవ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్పటికి మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది.ఓవరాల్ గా ప్రేమలు ప్రపంచ వ్యాప్తంగా 115కోట్ల వసూళ్లను సాధించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: