గీతాంజలి మళ్లీ వచ్చింది నుండి నాన్న ఎమోషనల్ సాంగ్ రిలీజ్

Nanna emotional song out from Geethanjali Malli Vachindhi movie

అంజ‌లి ప్రధాన పాత్రలో హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమా గీతాంజలి. 2014లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. దాదాపు 10 ఏళ్ల తరువాత ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమాను ముందు మార్చి 22వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు.. ఆతరువాత రిలీజ్ డేట్ ను మార్చారు. ఏప్రిల్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రెంటు కి డబ్బు లేదు సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. దేవుడి వరమే నువు నాకు అంటూ వచ్చే నాన్న మీద ఎమోషనల్ సాంగ్ ను ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

కాగా ఈసినిమాలో ఇంకా మలయాళ నటుడు రాహుల్ మాధవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో స‌త్య‌, సునీల్‌, ర‌విశంక‌ర్‌, శ్రీకాంత్ అయ్యంగార్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 14 =