మచ్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఈనెల 29న థియేటర్లలోకి వస్తుంది.డీజే టిల్లు ఊహించని విధంగా సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ ఫై అంచనాలు భారీగా వున్నాయి.ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా హైప్ తగ్గేట్లే వుంది.ఈసినిమాకు రామ్ మిరియాల,అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.ఇంతకుముందు విడుదలచేసిన రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా నిన్న మూడో సాంగ్ ఓ మై లిల్లీని రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే మొదట శ్రీ చరణ్ పాకాలను తీసుకున్నారు ఏమైందో తెలియదు అతన్ని తప్పించిన తరువాత తమన్ ను తీసుకోవాలనుకున్నారు అయితే బిజీ షెడ్యూల్ వల్ల తను కూడా తప్పుకున్నాడు దాంతో భీమ్స్ సిసిరోలియోను తీసుకున్నారు.
మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో టైటిల్ రోల్ లో సిద్దు జొన్నలగడ్డ నటించగా హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ కనిపించనుంది.ఇందులో ఇంతకుముందులా కాకుండా అనుపమా కొత్తగా కనిపించనుంది.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.మరి ఈసినిమా,డీజే టిల్లు మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.సోలో గా రిలీజ్ కానున్నడం కూడా టిల్లు స్క్వేర్ కు కలిసి రానుంది.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకోవడం ఖాయం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: