సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం వల్ల ఈసినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఫైనల్ గా అయితే ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మరింత క్రేజ్ ను పెంచుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పాటలను కూడా వరుసగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగా ఓ మై లిల్లీ అనే పాటను రిలీజ్ చేయనున్నారు. ఈ పాట ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా. ప్రోమో అయితే ఆకట్టుకుంది. ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. శ్రీరామ చంద్ర పాడిన ఈపాటకు సిద్దూ, రవి ఆంటోని లిరిక్స్ అందించారు.
Tillu’s Heartbreak Anthem Alert! ⚠️💔#OhMyLilly 💔 Lyric video from #TilluSquare is out now! 🤩
Lyrics by ‘STAR BOY’ #Siddu & #RaviAnthony
An @achurajamani Musical 🎹
🎤 @Sreeram_singer @anupamahere @MallikRam99 @ram_miriyala #BheemsCeciroleo… pic.twitter.com/sAREptVSt4— Sithara Entertainments (@SitharaEnts) March 18, 2024
కాగా ఈసినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా.. ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: