కంగువ టీజర్ రిలీజ్.. ట్రైబల్‌గా అదరగొట్టిన సూర్య

Suriya's Kanguva Movie Teaser Released

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. ప్రముఖ తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య నటించిన ‘సింగం’ సిరీస్‌కు దేవినే సంగీతం అందించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సూర్య 42వ ప్రాజెక్ట్‌గా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ‘కంగువ’ నుంచి రిలీజైన మూవీ గ్లింప్స్ ‌వీడియో, పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ‘కంగువ’ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో సూర్య నట విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా ట్రైబల్‌ క్యారక్టర్‌లో అయితే అదరగొట్టేశారు. చూడటానికి భీతిగొలిపేలా ఉన్న ఈ పాత్రను ఆయన తప్ప మరెవ్వరూ చేయలేరు అనేట్టుగా నటించారు. మొత్తానికి ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

సుమారు 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య పలు గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుండగా.. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో విడుదల కానుంది. ఇక ఇటీవలే కంగువ షూటింగ్ పూర్తి చేసుకున్న సూర్య మరోవైపు సుధా కొంగర డైరెక్షన్‌లో ‘#సూర్య43’లో నటించడానికి సిద్ధమయ్యారు. మరి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + eighteen =