రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఫ్యామిలీ మెన్ సిరీస్ తరువాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో సమంత తోపాటు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో వచ్చిన సిటాడెల్ కు హిందీ వెర్షనే అన్న సంగతి కూడా విదితమే. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజగాా ఈసిరీస్ టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఈ వెబ్ సిరీస్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఇండియన్ వెర్షన్ టైటిల్ ను రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సిటాడెల్-హనీ బన్నీ టైటిల్‌ను ఫైనల్ చేశారు.
ఇంకా ఈ వెబ్ సిరీస్ లో కేకే మీనన్, సిమ్రన్, సోహం మజుందార్, శివంకిత్ పరిహార్, కశ్వీ మజుందార్, సాఖిబ్ సలీం, సికిందర్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే డీటూఆర్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: