తమిళనాడు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది మలయాళ సినిమా మంజుమ్మెల్ బాయ్స్.ఈసినిమా నిన్నటి తో అక్కడ 50కోట్ల మార్క్ ను చేరుకుంది దాంతో అత్యధిక వసూళ్లను రాబట్టిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది.అంతేకాదు కేవలం మలయాళ వెర్షన్ ద్వారానే ఈ ఫీట్ సాధించింది.ఇక తమిళనాడు లో ఇంతకుముందు కేవలం 5 పరభాషా సినిమాలు మాత్రమే 50కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి.అందులో బాహుబలి ,బాహుబలి 2 ,ఆర్ఆర్ఆర్,కెజిఎఫ్2,అవతార్ 2 సినిమాలు ఉండగా తాజాగా మంజిమ్మెల్ బాయ్స్ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ముందు వరకు మలయాళ సినిమా కురుప్ 5.8కోట్లతో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా వుండేదికాని ఇప్పుడు మంజిమ్మెల్ బాయ్స్ ఏకంగా 50కోట్లతో సెన్సేషన్ సృష్టించింది.ఓవరాల్ గా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా నిన్నటి వరకు ఈసినిమా 195కోట్ల వసూళ్లను రాబట్టింది.రేపటితో 200కోట్ల మార్క్ ను చేరుకోనుంది దాంతో ఈ ఫీట్ సాధిస్తున్న మొదటి మాలీవుడ్ మూవీగా రికార్డు క్రియేట్ చేయనుంది.
ఇక ఈసినిమా తెలుగులోకి వస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ మంజిమ్మెల్ బాయ్స్ ను తెలుగులో విడుదలచేస్తుంది.ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతుంది.అన్ని కుదిరితే ఈ శుక్రవారమే ఈసినిమా విడుదలయ్యే ఛాన్స్ వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: