కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 138

akshay kumar joins in manchu vishnus kannappa movie
సినిమా వార్తలు

కన్నప్ప లో బాలీవుడ్ సూపర్ స్టార్

చాలా గ్యాప్ తరువాత విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం అయితే న్యూజిలాండ్ లోనే సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Jagapathi Babu First Look Poster Released From Mr. Bachchan Movie
ఫస్ట్ లుక్

మిస్టర్ బచ్చన్‌.. జగపతిబాబు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్‌'. 'నామ్ తో సునా హోగా' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టులోకి ఒక స్టార్ నటుడు ఎంటరయ్యారు. ఈ మేరకు చిత్ర బృందం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. టాలీవుడ్ బిజీయెస్ట్ యాక్టర్స్‌లో ఒకరైన జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Srikanth Mవాట్సాప్
allu arjun pushpa 2 movie teaser out now
ట్రైలర్ & టీజర్

పుష్ప 2 టీజర్ రిలీజ్- బన్నీ మాస్ జాతర

మొత్తానికి ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది పుష్ప2 టీజర్ కోసం. నేడు బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు నాలుగు రోజుల క్రితమే ప్రకటించారు. అప్పటినుండి టీజర్ ఎప్పుడువస్తుందా అని చూస్తున్నారు. ఫైనల్ గా టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక టీజర్ లో బన్నీ మరోసారి మాస్ జాతర చూపించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చీర కట్టుకొని ఒంటి నిండా నగలుతో ఉన్న బన్నీ లుక్కే కిక్ ఇస్తుంది. దానికితోడు యాక్షన్ సీక్వెన్స్, బన్నీ యాటిట్యూట్, దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్…

TFN Adminవాట్సాప్
aadu jeevitham movie joins in 100 crore club
సినిమా వార్తలు

ఆడు జీవితం ఖాతాలో కొత్త రికార్డ్

మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి వచ్చిన సినిమా ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఫైనల్ గా ఎన్నో అంచనాల మధ్య మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతంచేసుకుంది. ముఖ్యంగా సుకుమార్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

TFN Adminవాట్సాప్
crazy update on indian 2 movie release
సినిమా వార్తలు

ఇండియన్ 2 రిలీజ్ పై బిగ్ అనౌన్స్ మెంట్

లోకనాయకుడు కమల్ మాత్రం ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం కమల్ లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా.. అందులో ఇండియన్ 2 సినిమా కూడా ఒకటి. నిజానికి ఈసినిమా మొదలై దాదాపు రెండేళ్లు అయిపోతుంది. మొదటగా షూటింగ్ బాగానే ఉన్నా ఆ తరువాత పలు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఫైనల్ గా ఈఏడాది జనవరిలో షూటింగ్ ను పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంది.

TFN Adminవాట్సాప్
Aadujeevitham becomes All Time Highest Mollywood
సినిమా వార్తలు

ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ఆడు జీవితం

ఈఏడాది మలయాళ ఇండస్ట్రీ పీక్ సక్సెస్ ను చూస్తుంది. ఫిబ్రవరి లో మొదలైన బాక్సాఫీస్ హావ వరుసగా మూడో నెల కూడా కొనసాగుతుంది.4సినిమాలు కలిపి ఏకంగా 500కోట్ల కలెక్షన్స్ ను రాబట్టాయి. ఇందులో మంజుమ్మల్ బాయ్స్ 200కోట్లకు పైగా రాబట్టి ఇండస్ట్రీ హిట్ అవ్వగా ప్రేమలు 135కోట్ల ను భ్రమయుగం 50కోట్ల వసూళ్లను రాబట్టుకున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Naga Chaitanya Akkineni Launched DeAr Telugu Trailer
ట్రైలర్ & టీజర్

డియర్ తెలుగు ట్రైలర్‌ లాంఛ్ చేసిన నాగచైతన్య

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మరియు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డియర్’. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా తాజాగా ‘డియర్’ చిత్రం తెలుగు ట్రైలర్‌ రిలీజ్ అయింది. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య చేతులమీదుగా ఈ ట్రైలర్‌ విడుదలవడం విశేషం.

Srikanth Mవాట్సాప్
dear movie telugu trailer out now
ట్రైలర్ & టీజర్

డియర్ తెలుగు ట్రైలర్ రిలీజ్

ఇతర భాషల సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడం కొత్తేమీ కాదు. కొన్ని సినిమాలు అక్కడ రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన తరువాత ఇక్కడ రిలీజ్ అవుతాయి.. కొన్ని సినిమాలు డైరెక్టర్ గా ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. అలాా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా డియర్. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా 'డియర్'. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
om bheem bush movie break even in all areas
సినిమా వార్తలు

ఓం భీమ్ బుష్- అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్

గత ఏడాది సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీ‌విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఎన్నో అంచనాల మధ్య మార్చి 22వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Warner awaiting the teaser for Pushpa 2
ట్రైలర్ & టీజర్

పుష్ప 2 టీజర్ కోసం ఎదురుచూస్తున్న వార్నర్

పుష్ప 2 టీజర్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు క్రికెటర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అందులో ఇండియన్ మాజీ క్రికెటర్ సురేష్ రైనా ,ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వున్నారు.పుష్ప రిలీజైన టైంలో డేవిడ్ వార్నర్ ఆసినిమాకు ఫ్యాన్ అయిపోయాడు. మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో శ్రీవల్లి స్టెప్ ను అలాగే తగ్గేదేలేదు అంటూ అల్లు అర్జున్ డైలాగ్ ను పలు సార్లు రీ క్రీయేట్ చేశాడు.

Mahender Reddyవాట్సాప్
jr ntr to grace siddhu jonnalagadda tillu square movie success meet
సినిమా వార్తలు

ఎన్టీఆర్ అతిథిగా టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్

బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ జోరు మాములుగా లేదు. దానికితోడు ఇప్పుడు సరైన సినిమాలు కూడా లేకపోవడంతో టిల్లు తన హవాను కొనసాగిస్తున్నాడు. రామ్ మల్లిక్ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ కు తరువాత ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. సినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోతుంది.. ఈ వారం రోజుల్లో ఈసినిమా 96కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Unveils Ashok Galla Concept Poster
ఫస్ట్ లుక్

అశోక్ గల్లా న్యూ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు అశోక్ గల్లా. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే మొదటి సినిమాతోనే నటనతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా వస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
manjummel boys telugu review
రివ్యూ

రివ్యూ :మంజుమ్మల్ బాయ్స్

ఓవరాల్ గా మళయాలం లో రికార్డులు క్రీయేట్ చేసి తెలుగులోకి వచ్చిన ఈసినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది.మీ గ్యాంగ్ తో వెళ్లి ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను ఎంజాయ్ చేయొచ్చు.

Mahender Reddyవాట్సాప్
family star movie usa first day collections
బాక్సాఫీస్

ఫ్యామిలీ స్టార్ యూస్ఏ లో కలెక్షన్ల పరుగులు

కొన్ని కొన్ని సినిమాలకు కాంబినేషన్స్ బట్టే ఆసినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరగడం చూస్తాం. అలాంటి సినిమానే ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ లాంటి హీరో, పరుశురాం లాంటి డైరెక్టర్.. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ రావడం.. దానికితోడు దిల్ రాజు నిర్మాత, సీతారామం ఫేమ్ మృణాల్ హీరోయిన్ ఉంటే ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా సినిమా ప్రారంభం నుండి రిలీజ్ వరకూ మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది ఫ్యామిలీ స్టార్ సినిమా. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది అని…

TFN Adminవాట్సాప్
Tillu Square Collects Over Rs.96.6 Cr Gross in 8 Days
సినిమా వార్తలు

100 కోట్ల దిశగా టిల్లు స్క్వేర్

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అలాగే హారో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్వయంగా కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలిరోజే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
Geethanjali Malli Vachindi Censor Certificate
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న గీతాంజలి మళ్లీ వచ్చింది

అంజ‌లి ప్రధాన పాత్రలో హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమా గీతాంజలి. 2014లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. దాదాపు 10 ఏళ్ల తరువాత ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఏప్రిల్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Thalapathy Vijay off to Russia for the Final schedule of The Greatest Of All Time
షూటింగ్ అప్‌డేట్

రష్యాకు విజయ్

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) షూటింగ్ కోసం రష్యా కు పయనమయ్యాడు.అక్కడ ఈసినిమా చివరి షెడ్యూల్ ను షూట్ చేయనున్నారు.మొన్నటి వరకు ఈసినిమా షూటింగ్ కేరళ లో జరుగగా ఆషెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.ఇక ఇప్పుడు రష్యా లో జరుగనుంది.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోగా రష్యా షెడ్యూల్ తో సినిమా కంప్లీట్ కానుంది.ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Vennela Kishore Chari 111 Streaming Now on Amazon Prime Video
ఓటీటీ

ఓటీటీలోకి వ‌చ్చేసిన వెన్నెల కిశోర్ చారి 111

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన సినిమా ‘చారి 111’. ఈ చిత్రాన్ని బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించగా.. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా 'మళ్ళీ మొదలైంది' ఫేమ్ టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. వెన్నెల కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటించగా.. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే థియేట‌ర్ల‌లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేక‌పోయిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మోస్తారు క‌లెక్ష‌న్స్‌ సాధించింది.

Srikanth Mవాట్సాప్
tillu square movie first week collections
బాక్సాఫీస్

టిల్లు స్క్వేర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

కొన్ని సినిమాలకు కథలతో పెద్దగా పనిలేదు. ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు ఎంటర్ టైన్ చేస్తే చాలు సూపర్ హిట్ టాక్ లను సొంతం చేసుకుంటాయి. అలా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అలాంటి జాబితాలోకే వస్తుంది డీజే టిల్లు సినిమా. డీజే టిల్లు కథ గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏం ఉండదు.. కానీ టిల్లు క్యారెక్టరే సినిమాను నడిపిస్తుంది. టిల్లు పాత్రలో నటించిన సిద్దు జొన్నలగడ్డ తన నటనతో, డైలాగ్స్ తో సినిమాను హిట్ చేశాడు. దానితో ఇప్పుడు టిల్లు స్క్వేర్ అంటూ వచ్చారు. ఇక ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈసారి కొత్త కథతో వచ్చిన సిద్దూ.. కామెడీ యాంగిల్ ను మాత్రం వదల్లేదు. దాంతో సీక్వెల్…

TFN Adminవాట్సాప్
Devaki Nandana Vasudeva first single yeamayyinde song promo out now
సాంగ్

అశోక్ గల్లా దేవకీ నందన వాసుదేవ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అశోక్ గల్లా. హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అశోక్ మొదటి సినిమాతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా వస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్