అంజలి ప్రధాన పాత్రలో హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమా గీతాంజలి. 2014లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. దాదాపు 10 ఏళ్ల తరువాత ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఏప్రిల్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్, ట్రైలర్ పలు పాటలు రిలీజ్ చేయగా అన్ని అప్ డేట్లు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలియచేశారు.
Get Ready for 𝗨nlimited entert𝗔inment!! 🤘#GeethanjaliMalliVachindhi now censored with U/A certificate, promises laughs and scares for all ages 👻🔥#GMVTrailer Trending Now on YouTube 👇https://t.co/u1BT1FddBX
Grand Release worldwide on April 11th#GMVOnApril11 #Anjali50 pic.twitter.com/vaqnyfH09t
— Kona Film Corporation (@KonaFilmCorp) April 6, 2024
కాగా ఈసినిమాలో ఇంకా మలయాళ నటుడు రాహుల్ మాధవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్లో సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు రాహుల్. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























