డియర్ తెలుగు ట్రైలర్‌ లాంఛ్ చేసిన నాగచైతన్య

Naga Chaitanya Akkineni Launched DeAr Telugu Trailer

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మరియు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డియర్’. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా తాజాగా ‘డియర్’ చిత్రం తెలుగు ట్రైలర్‌ రిలీజ్ అయింది. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య చేతులమీదుగా ఈ ట్రైలర్‌ విడుదలవడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా శనివారం సాయంత్రం ‘డియర్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ లో ఇలా తెలిపారు.. “ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ఇష్టపడేది ఏంటో మీకు తెలుసా? (రాత్రిపూట ఒక మంచి నిద్ర). నిజంగా ఈ కథను చెబుతున్నందుకు ఆనందిస్తున్నాను.. అర్జున్ భయానికి నిజంగా కనెక్ట్ అయ్యాను, అలాగే మీలో చాలా మంది కూడా ఇలాగే చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని అందులో నాగచైతన్య పేర్కొన్నారు.

‘డియర్’ ట్రైలర్‌ ఎలా ఉందంటే..?

ఇక ‘డియర్’ ట్రైలర్‌ను గమనిస్తే.. హీరో జీవీ ప్రకాష్ న్యూస్ రీడర్‌గా కనిపించగా.. రోహిణి ఆయనకు తల్లిగా, అలాగే కాళీ వెంకట్ సోదరుడిగా నటించారు. ఇక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌తో ప్రకాష్ కు పెద్దల సమక్షంలో సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతుంది. అయితే, పెళ్లి తర్వాత అతడికి ఒక వింత సమస్య ఎదురవుతుంది. భార్యకి ఉన్న గురక సమస్యతో ప్రకాష్ సతమవుతుంటాడు. భార్య గురకతో వారి వైవాహిక జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివలన వారిద్దరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి?చివరకు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇది ఎక్కడి వరకు వెళ్లింది? అనేది సినిమాగా చూపించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 6 =