పుష్ప 2 టీజర్ కోసం ఎదురుచూస్తున్న వార్నర్ 

Warner awaiting the teaser for Pushpa 2

పుష్ప 2 టీజర్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు క్రికెటర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అందులో ఇండియన్ మాజీ క్రికెటర్ సురేష్ రైనా ,ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వున్నారు.పుష్ప రిలీజైన టైంలో డేవిడ్ వార్నర్ ఆసినిమాకు ఫ్యాన్ అయిపోయాడు. మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో శ్రీవల్లి స్టెప్ ను అలాగే తగ్గేదేలేదు అంటూ అల్లు అర్జున్ డైలాగ్ ను పలు సార్లు రీ క్రీయేట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు సీక్వెల్ కోసం కూడా వార్నర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.నిన్న మేకర్స్ టీజర్ కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఆ పోస్టర్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి టీజర్ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ కామెంట్ పెట్టాడు.దీనికి అల్లు అర్జున్ థాంక్యూ అని బదులు ఇచ్చాడు.అలాగే సురేష్ రైనా కూడా తన ఇంస్టా స్టేటస్ లో ఈపోస్టర్ ను అప్లోడ్ చేశాడు.

ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈటీజర్ ఈనెల 8న విడుదలకానుంది.ఇండస్ట్రీ చూపంతా ఈటీజర్ పైనే వుంది.ఈసినిమా థియేట్రికల్,నాన్ థియేట్రికల్ బిజినెస్ 700కోట్ల వరకు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.ఈ టీజర్ కనుక అదిరిపోతే ఆ బిజినెస్ మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.జూన్ లోపు సినిమాను పూర్తి చేసి ఆగస్టు 15న విడుదలచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 20 =