హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు అశోక్ గల్లా. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే మొదటి సినిమాతోనే నటనతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా వస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు అశోక్ గల్లా పుట్టినరోజు కావడంతో తన సినిమాల నుండి అప్ డేట్లు ఇస్తున్నారు. దీనిలో భాగంగానే తన కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఉద్బవ్ దర్శకత్వంలో అశోక్ గల్లా హిరోగా ఈసినిమా వస్తుంది. ఈనేపథ్యంలో ఈసినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Happy birthday @AshokGalla_
The poster looks fun! Looking forward to this one! 🤗 pic.twitter.com/o8J1uuUIb6— Mahesh Babu (@urstrulyMahesh) April 5, 2024
కాగా ఈసినిమాలో లవర్, మ్యాడ్ సినిమాల ఫేమ్ శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే నటీనటులు, ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: