ఓటీటీలోకి వ‌చ్చేసిన వెన్నెల కిశోర్ చారి 111

Vennela Kishore Chari 111 Streaming Now on Amazon Prime Video

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన సినిమా ‘చారి 111’. ఈ చిత్రాన్ని బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించగా.. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’ ఫేమ్ టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. వెన్నెల కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటించగా.. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే థియేట‌ర్ల‌లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేక‌పోయిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మోస్తారు క‌లెక్ష‌న్స్‌ సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా చారి 111 సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఎలాంటి అనౌన్స్‌మెంట్స్ లేకుండానే ఈ కామెడీ ఎంటర్‌టైనర్ అమెజాన్ ప్రైమ్‌లోకి రావడం విశేషం. ఇక ఇందులో వెన్నెల కిశోర్ ‘చారి’ అనే స్పై పాత్రలో కనిపించి సందడి చేశారు. త‌న కామెడీ టైమింగ్‌తో సినిమా ఆసాంతం నవ్వులు పూయించాడు.

కాగా ఈ సినిమాలో.. బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, ‘తాగుబోతు’ రమేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రిచర్డ్ కెవిన్ ఎ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. కరుణాకర్ స్టంట్స్ రూపొందించారు. ఇక అక్షత బి హొసూరు ప్రొడక్షన్ డిజైన్ చేయగా.. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్య సహకారం అందించారు. అలాగే సినిమాటోగ్రాఫర్‌గా కషిష్ గ్రోవర్.. సంగీత దర్శకుడిగా సైమన్ కె కింగ్ పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.