ఇతర భాషల సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడం కొత్తేమీ కాదు. కొన్ని సినిమాలు అక్కడ రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన తరువాత ఇక్కడ రిలీజ్ అవుతాయి.. కొన్ని సినిమాలు డైరెక్టర్ గా ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. అలాా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా డియర్. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్’. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఏప్రిల్ 12వ తేదీన తెలుగులో ఈసినిమా రిలీజ్ అవుతుంది. దీంతో ప్రస్తుతం తెలుగులో కూడా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యంగ్ హీరో నాగ చైతన్య చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. మరి తెలుగులో ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
You know what I love the most in this world ? A good nights sleep 🙂 Really enjoyed narrating this one .. and truly connected to Arjun’s fear , I’m sure a lot of you will too … #DeArTelugu Trailer is out now
https://t.co/q7r4sXoCce#DeAr #DeArTeluguFromApril12#DeAr All the… pic.twitter.com/vGcuvw1JSq
— chaitanya akkineni (@chay_akkineni) April 6, 2024
కాగా ఈసినిమాలో ఇంకా డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మిస్తుండగా.. జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: