కొన్ని కొన్ని సినిమాలకు కాంబినేషన్స్ బట్టే ఆసినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరగడం చూస్తాం. అలాంటి సినిమానే ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ లాంటి హీరో, పరుశురాం లాంటి డైరెక్టర్.. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ రావడం.. దానికితోడు దిల్ రాజు నిర్మాత, సీతారామం ఫేమ్ మృణాల్ హీరోయిన్ ఉంటే ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా సినిమా ప్రారంభం నుండి రిలీజ్ వరకూ మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది ఫ్యామిలీ స్టార్ సినిమా. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది అని చెప్పొచ్చు. దీంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై కూడా పడింది. ఇక్కడ విజయ్ క్రేజ్ కు సంబంధం లేకుండా కలెక్షన్స్ వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా యూఎస్ఏ లో మాత్రం ఈసినిమాాకు మంచి ఆదరణే లభిస్తుంది అని చెప్పొచ్చు. అక్కడ కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమాకు మొదటి రోజే సాలిడ్ కలెక్షన్స్ లభించాయి. ఫస్ట్ డే నే హాఫ్ మిలియన్ మార్క్ కు చేరువగా కలెక్షన్స్ అందాయి. మొదటిరోజు ఈసినిమా 475 కే డాలర్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
#TheFamilyStar has everyone hooked with its magic! 😍
USA gross has hits $475K+ and smashing the audience’s hearts! 💥
Don’t miss this perfect family entertainer in theatres near you ⭐️#FamilyStar overseas by @sarigamacinemas pic.twitter.com/9hVRqWgXMQ
— Sarigama Cinemas (@sarigamacinemas) April 6, 2024
కాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చింది. ఈ సినిమాలో గోవర్ధన్ అనే మిడిల్ క్లాస్ యువకుడిగా విజయ్ దేవరకొండ కనిపించాడు. అతని జీవితంలోకి ఇందు ఎలా వచ్చింది? ఇందును ప్రేమించిన గోవర్ధన్ ఆమెకు ఎందుకు బ్రేకప్ చెప్పాడు? జాబ్ కోసం గోవర్ధన్ అమెరికా వెళ్లగా అతడి వెంట ఇందు ఎందుకు వచ్చింది? చివరికి గోవర్ధన్, ఇందు ఎలా ఒక్కటయ్యారు అనేదే ఈసినిమా కథ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: