రష్యాకు విజయ్ 

Thalapathy Vijay off to Russia for the Final schedule of The Greatest Of All Time

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) షూటింగ్ కోసం రష్యా కు పయనమయ్యాడు.అక్కడ ఈసినిమా చివరి షెడ్యూల్ ను షూట్ చేయనున్నారు.మొన్నటి వరకు ఈసినిమా షూటింగ్ కేరళ లో జరుగగా ఆషెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.ఇక ఇప్పుడు రష్యా లో జరుగనుంది.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోగా రష్యా షెడ్యూల్ తో సినిమా కంప్లీట్ కానుంది.ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా సీనియర్ హీరో ప్రశాంత్ ,లైలా ,మీనాక్షి చౌదరీ,యోగిబాబు వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.దీపావళికి విడుదలచేసే ప్లాన్ లో వున్నారు.థియేట్రికల్ రిలీజ్ తరువాత ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి రానుంది.

ఇక ఈసినిమా తరువాత విజయ్ మరో సినిమా చేసి గుడ్ బై చెప్పనున్నాడు.రీసెంట్ గా తను పొలిటికల్ పార్టీ కూడా పెట్టిన సంగతి తెలిసిందే.దాంతో తన 79వ సినిమా చివరిది కానుంది. ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నాడు.ఈసినిమా కోసం విజయ్ కి రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారని టాక్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 11 =