కొన్ని సినిమాలకు కథలతో పెద్దగా పనిలేదు. ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు ఎంటర్ టైన్ చేస్తే చాలు సూపర్ హిట్ టాక్ లను సొంతం చేసుకుంటాయి. అలా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అలాంటి జాబితాలోకే వస్తుంది డీజే టిల్లు సినిమా. డీజే టిల్లు కథ గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏం ఉండదు.. కానీ టిల్లు క్యారెక్టరే సినిమాను నడిపిస్తుంది. టిల్లు పాత్రలో నటించిన సిద్దు జొన్నలగడ్డ తన నటనతో, డైలాగ్స్ తో సినిమాను హిట్ చేశాడు. దానితో ఇప్పుడు టిల్లు స్క్వేర్ అంటూ వచ్చారు. ఇక ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈసారి కొత్త కథతో వచ్చిన సిద్దూ.. కామెడీ యాంగిల్ ను మాత్రం వదల్లేదు. దాంతో సీక్వెల్ కూడా అందరినీ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఏరేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టుకుంటుందో చూస్తూనే ఉన్నాం. ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోయింది. ఈ వారం రోజుల్లో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈ వారం రోజుల్లో టిల్లు స్క్వేర్ కలెక్షన్స్ ను చూస్తే 94 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకొని త్వరలో 100 కోట్ల క్లబ్ లోకి చేరనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























