ఇండియన్ 2 రిలీజ్ పై బిగ్ అనౌన్స్ మెంట్

crazy update on indian 2 movie release

లోకనాయకుడు కమల్ మాత్రం ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం కమల్ లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా.. అందులో ఇండియన్ 2 సినిమా కూడా ఒకటి. నిజానికి ఈసినిమా మొదలై దాదాపు రెండేళ్లు అయిపోతుంది. మొదటగా షూటింగ్ బాగానే ఉన్నా ఆ తరువాత పలు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఫైనల్ గా ఈఏడాది జనవరిలో షూటింగ్ ను పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులైపోయింది. అయితే తాజాగా ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చేశారు. జూన్ లో ఈసినిమా ను ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపారు.

ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, సుభాస్కరన్‌ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =