తలైవా 171 టైటిల్ రిలీజ్

thalaivar 171 movie title released

తలైవా రజనీకాంత్ ఈ వయసులో కూడా ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టైయాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. కాగా మంజు వారియర్, రితికా సింగ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ ఇంకా రానా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తలైవా 171 సినిమాగా ఈసినిమా వస్తుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి టైటిల్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు కూలీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక గ్లింప్స్ ను బట్టి ఈసినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రానన్నట్టు అర్థమవుతుంది.

కాగా ఈసినిమాను స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో క‌ళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.