ప్రసన్నవదనం.. మైత్రీ చేతికి తెలంగాణ, తమిళనాడు రిలీజ్ రైట్స్

Mythri Movie Distributors to be Released Prasanna Vadanam in Telangana and Tamil Nadu

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తన ప్రతిభతో క్యారక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరో స్టార్‌డమ్ సొంతం చేసుకున్నవారు అతి తక్కువమంది ఉంటారు. అలాంటివారిలో సుహాస్ ఒకడు. కెరీర్‌ ప్రారంభంలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఒకవైపు కమెడియన్‌గా, విలన్‌గా నటిస్తూనే.. తొలిసారిగా ‘కలర్ ఫోటో’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వరుసగా.. ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో సుహాస్ హీరోగా మరో సినిమా రూపొందుతోంది. ‘ప్రసన్నవదనం’ అనేది ఈ మూవీ టైటిల్ కాగా.. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ని ఇటీవలే విడుదల చేయగా.. మంచి స్పందన రాబట్టుకుంది. కాగా సుహాస్ ఈ సినిమాలో ‘ఫేస్ బ్లైండ్‌నెస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడే యువకుడిగా నటించాడు. ఈ వ్యాధి బారిన పడినవారు ఎదుటివారి ముఖాన్ని గుర్తుప‌ట్టలేరు. ఇక ‘ప్రసన్నవదనం’ చిత్రాన్ని నిర్మాతలు మణికంఠ, ప్రసాద్ రెడ్డి లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. టీజర్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలో ‘ప్రసన్నవదనం’ చిత్రాన్ని తెలంగాణ మరియు తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. టాలీవుడ్ లోని అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రసన్న వదనం సినిమాను ఈ రెండు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. ఈ న్యూస్ బయటకు వచ్చాక ఈ చిత్రంపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. కాగా మే 3న ‘ప్రసన్నవదనం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.