
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 83


డబల్ ఇస్మార్ట్ షూటింగ్ షురూ

మహేష్ తో నటించడమే డ్రీమ్

మలయాళం లోకి మైత్రీ ఎంట్రీ- షూటింగ్ మొదలు

ఫైటింగ్ సీక్వెన్స్ తో గేమ్ ఛేంజర్ షూట్ షురూ

నాని 30 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

మరో థ్రిల్లర్ తో విరూపాక్ష డైరెక్టర్

మహావీరుడు కోసం మాస్ మహారాజా వాయిస్ ఓవర్

గాండీవధారి అర్జున ప్రీ టీజర్ రిలీజ్

ఫుల్ స్వింగ్ లో సుధీర్ హరోం హర

థియేటర్లలో ఈ వారం రిలీజ్ అవనున్న సినిమాలు

నాని 30 అప్ డేట్ కి డేట్ ఫిక్స్

సుందరం మాస్టర్ టీజర్ రిలీజ్

ఆర్ఆర్ఆర్ తర్వాత జపాన్ లో కె.జి.యఫ్1, కె.జి.యఫ్2

నాని 30కి ఇంట్రెస్టింగ్ టైటిల్
నాని నటిస్తున్న30వ సినిమా టైటిల్ గ్లింప్స్ కొద్దిసేపటి క్రితం విడుదలైయింది.తండ్రి,కూతురుకి మధ్య జరిగే కథతో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాకి హాయ్ నాన్న అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈసంధర్భంగా విడుదలచేసిన గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది.నాని లుక్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ లో హైలైట్ అయ్యాయి.మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కైరా ఖన్నా,నాని కూతురిగా కనిపించనుంది.ఓవరాల్ గా తాజాగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ,సినిమాపై అంచనాలను పెంచేసింది.

భోళా శంకర్ డబ్బింగ్ పూర్తి చేసుకున్న హాస్య బ్రహ్మ
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తరువాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ఒక సినిమా తరువాత మరో సినిమా చేసేస్తున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం 'భోళా శంకర్'. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే.

డబల్ ఇస్మార్ట్ షూటింగ్ షురూ
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ ఈసారి డబల్ ఎంటర్ టైన్మెంట్ తో వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈసినిమాలో రామ్ మునుపెన్నడూ కనిపించని మాస్ అవతార్ కనిపించి అలరించాడు. పూరీ మేకింగ్, పాటలు, రామ్ నటన ఈసినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచి అంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఆక్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలోనే ఈసినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.

మహేష్ తో నటించడమే డ్రీమ్
ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సెలబ్రిటీకి ఒక డ్రీమ్ ఉంటుంది. డైరెక్టర్ అయితే పలానా హీరోతో చేయాలని.. హీరో అయితే పలానా డైరెక్టర్ తో చేయాలని.. అలానే హీరోయిన్స్ కు కూడా పలానా హీరోతో చేయాలని అనుకుంటు ఉంటారు. కొంతమందికి అది వర్కవుట్ అవ్వొచ్చు.. కొంతమందికి అది వర్కవుట్ కాకపోవచ్చు. ఇక ఇప్పుడు మృణాల్ కూడా తన డ్రీమ్ ఏంటో చెబుతుంది.

బ్రో సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా సముద్రఖని తమిళ్ లో దర్శకత్వంలో వహించిన వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా అన్ని పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది.

మలయాళం లోకి మైత్రీ ఎంట్రీ- షూటింగ్ మొదలు
శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా నిలిచింది. తీసిన సినిమాలన్నీ హిట్టవ్వడం.. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం.. వరుస పెట్టి సినిమాలు తీస్తుండటంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ బ్యానర్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇక ఈ ఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంది.

ఖుషి నుండి సెకండ్ సాంగ్ రిలీజ్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ,సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఈసినిమా నుండి రీసెంట్ గా విడుదలైన మొదటి పాట నా రోజా నువ్వే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.తెలుగు వెర్షన్ సాంగ్ యూట్యూబ్ లో 61మిలియన్ల వ్యూస్ రాబట్టుకుంది.ఇక ఇప్పుడు రెండో పాటను కూడా విడుదలచేశారు.ఆరాధ్య అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ కూడా క్యాచీ గా వుంది.

ఫైటింగ్ సీక్వెన్స్ తో గేమ్ ఛేంజర్ షూట్ షురూ
లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను పార్లల్ గా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో బిజీ అయిపోయాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మెసేజ్ ఒరియెంటెడ్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ఇటీవలే ఈసినిమా టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

నాని 30 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈఏడాది మార్చిలో దసరాతో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు న్యాచురల్ స్టార్ నాని. ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక దసరా తరువాత నాని ప్రస్తుతం తన 30వ సినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.తండ్రి,కూతురికి మధ్య జరిగే కథతో తెరకెక్కుతుంది.మూవీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా ఉండనుంది.ఇప్పటికే ఈసినిమాకు పాజిటివ్ బజ్ వచ్చేసింది.ఈసినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను రేపు ఉదయం 11గంటలకు విడుదలచేయనున్నారు.

మరో థ్రిల్లర్ తో విరూపాక్ష డైరెక్టర్
కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు యంగ్ డైరెక్టర్స్. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి థ్రిల్లింగ్ ను ఇచ్చిన సినిమా విరూపాక్ష. కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను అందుకుంది. యాక్సిడెంట్ తర్వాత ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన సాయి తేజ్‌కు ఈ సినిమా సాలిడ్ హిట్ ఖాతాలో పడింది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. కార్తీక మేకింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఈసినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా సాయి ధరమ్ తేజ్ కు కెరీరర్ బెస్ట్ కలెక్షన్స్…

మహావీరుడు కోసం మాస్ మహారాజా వాయిస్ ఓవర్
కొంతమంది హీరోలు నటిస్తే నటించినట్టు అనిపించదు.. చాలా సహజంగా ఉంటుంది. అయితే అలాంటి హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో తమిళ్ టాలెంటెండ్ నటుడు శివ కార్తికేయన్ పేరు కూడా ఉంటుంది. తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నుండి వస్తున్న సినిమా మహావీరుడు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. తమిళ్ లో మావిరన్ అనే టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో మహావీరుడు అనే టైటిల్ తో వస్తుంది.

ఓటీటీ లోకి వచ్చేస్తున్న సామజవరగమన
విభిన్నమైన సినిమాలు, ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. ఇక రీసెంట్ గానే శ్రీవిష్ణు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశాడు. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా సామజవరగమన. ఈసినిమా ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మంచి ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

గాండీవధారి అర్జున ప్రీ టీజర్ రిలీజ్
వరుణ్ తేజ్,ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గాండీవధారి అర్జున.స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా టీజర్ రిలీజ్ కానుంది.అందులో భాగంగా కొద్దీ సేపటి క్రితం ప్రీ రిలీజ్ టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ ప్రీ రిలీజ్ టీజర్ స్టైలిష్ గా వుంది.విజువల్స్ హాలీవుడ్ మూవీ స్థాయిలో వుంది. పూర్తి టీజర్ ను అతి త్వరలో రిలీజ్ చేయనున్నారు.

ఫుల్ స్వింగ్ లో సుధీర్ హరోం హర
కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుధీర్ బాబు. మొదట చిన్న పాత్రల్లో నటించిన సుధీర్ బాబు ఆ తర్వాత హీరోగా మారి ఇప్పటివరకూ కెరీర్ ను బాగానే కొనసాగిస్తున్నాడు. మొదటినుండీ సుధీర్ బాబు కూడా కాస్త డిఫరెంట్ సినిమాలే చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుండేవాడు. కొన్ని మంచి విజయం సాధించగా.. కొన్ని మాత్రం పరాజయాలే అందించాయి. అయినా కూడా సుధీర్ బాబు జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్…

థియేటర్లలో ఈ వారం రిలీజ్ అవనున్న సినిమాలు
ఈ వారం థియేటర్లలో కొన్ని కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. అయితే వీటిలో డబ్బింగ్ అయిన సినిమాలే ఎక్కువ ఉండనున్నాయి. తెలుగు స్టార్ హీరోల సినిమాలు కాకపోయినప్పటికీ.. ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు, తెలుగువారికి పరిచయమైనవారు నటించినవి కావడం, మరియు మంచి కంటెంట్‌తో వస్తున్నట్లు ఆయా చిత్రాల యూనిట్లు ఇప్పటికే ప్రకటించడంతో ఈ సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం..!

నాని 30 అప్ డేట్ కి డేట్ ఫిక్స్
న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది దసరా తో మంచి స్టార్టప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. నాని ప్రధాన పాత్రలో శౌర్యవ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నాని 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

బ్రో ఫస్ట్ సాంగ్ పై థమన్ రియాక్షన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి తేజ్ కలిసి నటిస్తున్న బ్రో విడుదలకు మరి కొన్నిరోజుల సమయం మాత్రమే వుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్,పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఇక రీసెంట్ గా రిలీజైన ఈసినిమాలోని మొదటి సాంగ్ మై డియర్ మార్కండేయ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.అయితే ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా జరిగిన మీడియా మీట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

సుందరం మాస్టర్ టీజర్ రిలీజ్
కంటెంట్ ఉన్న సినిమాలకు ఈమధ్య ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూస్తూనే ఉన్నాం. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా కొత్త కొత్త ఐడియాస్ తో వస్తున్నారు. ఇక సినిమా బాగుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పుడు అలాంటి కంటెంట్ ను నమ్ముకునే ఒక సినిమా రాబోతుంది. ఆసినిమానే సుందరం మాస్టర్. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో హర్షచెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా సుందరం మాస్టర్. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈసినిమా పై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. సాయిధరమ్ చేతుల మీదుగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

భోళాశంకర్ నుండి జాం జాం జజ్జనక సాంగ్ రిలీజ్
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత జపాన్ లో కె.జి.యఫ్1, కె.జి.యఫ్2
మన సౌత్ సినిమాల ప్రభావం ఇతర ఇండస్ట్రీలపై ఎంతగా పడిందో చూస్తున్నాం. ప్రస్తుతం అయితే బాలీవుడ్ ను కూడా వెనక్కి నెట్టి సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ ప్రభావం చూపిస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలు అయితే అంతర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. ఇక కొన్ని సినిమాలను విదేశాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లో రిలీజ్ చేయగా అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమాలు సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పుడు మరో ఫ్రాంచైజ్ ప్రభంజనం సృష్టించడానికి సిద్దమవుతుంది. ఆ ఫ్రాంచైజ్ మరేదో కాదు కె.జి.యఫ్1, కె.జి.యఫ్2.