పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా సముద్రఖని తమిళ్ లో దర్శకత్వంలో వహించిన వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా అన్ని పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స. మై డియర్ మార్కండేయ అంటూ వచ్చిన ఈపాట మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు మామా అల్లుళ్ల మధ్య ఈపాట రావడంతో మంచి బజ్ కు క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి రెండో పాటను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈపాట రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జానవులే అంటూ వచ్చే సెకండ్ సింగిల్ ను జులై 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపుతూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ ను బట్టి ఈపాట హీరోయిన్ కేతికశర్మ, సాయిధరమ్ తేజ్ మధ్య ఉండబోతున్నట్టు అర్థమవుతుంది.
Get ready to immerse yourself in the symphony of love 🎶👩❤️👨#Jaanavule – #BroTheAvatar 2nd Single Lyrical Video on July 15th 📣
Stay tuned to @MangoMusicLabel 🎧@PawanKalyan @IamSaiDharamTej @TheKetikaSharma @thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla… pic.twitter.com/Nk7vIu0jBr
— People Media Factory (@peoplemediafcy) July 12, 2023
ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: