నాని 30 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ 

nani 30 title glimps out tomorrow

ఈఏడాది మార్చిలో దసరాతో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు న్యాచురల్ స్టార్ నాని. ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక దసరా తరువాత నాని ప్రస్తుతం తన 30వ సినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.తండ్రి,కూతురికి మధ్య జరిగే కథతో తెరకెక్కుతుంది.మూవీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా ఉండనుంది.ఇప్పటికే ఈసినిమాకు పాజిటివ్ బజ్ వచ్చేసింది.ఈసినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను రేపు ఉదయం 11గంటలకు విడుదలచేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్లా వాహబ్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈసినిమా డిసెంబర్ 21న తెలుగుతోపాటు హిందీ,తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో విడుదలకానుంది.మరి నాని ఈసినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడతాడో లేదో చూడాలి.

ఇదిలావుంటే ఈసినిమా తరువాత నాని తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడితో చేయనున్నాడని టాక్. కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో డాన్ అనే సినిమా చేసిన డైరెక్టర్ శిబూ చక్రవర్తి ,నాని తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.మరి ఈవార్తలు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + five =