మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తరువాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ఒక సినిమా తరువాత మరో సినిమా చేసేస్తున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ‘భోళా శంకర్’. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పటికే చిరు తన డబ్బింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు. షూటింగ్, డబ్బింగ్ కంప్లీట్ చేసి సతీమణి సురేఖ తో కలిసి వెకేషన్ కు కూడా వెళ్లిపోయారు. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాకు సంబంధించి డబ్బింగ్ ను పూర్తి చేశారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. ఈనేపథ్యంలో డైరెక్టర్ మెహర్ రమేష్ తన ట్విట్టర్ ద్వారా బ్రహ్మానందం డబ్బింగ్ చెబుతున్నఫొటోలను పోస్ట్ చేస్తూ ఈసినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్న హాస్య బ్రహ్మ తన డబ్బింగ్ ను పూర్తిచేసుకున్నారు.. థియేటర్లలో నవ్వులు తెప్పించడం గ్యారెంటీ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
“Hasya Brahma” #Brahmanandam garu Dubbing done for special guest role in @BholaaShankar 🔱
loud laughs guaranteed in theatres 🎭 #Megastar 🌟@KChiruTweets @tamannaahspeaks @ComedianAadi @harshachemudu @AKentsOfficial @AnilSunkara1 @SagarMahati @dudlyraj @cinesoul1 @prakash3933 pic.twitter.com/yiZhsJlYH7— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) July 13, 2023
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు. ఈసినిమా ఆగష్ట్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: