మరో థ్రిల్లర్ తో విరూపాక్ష డైరెక్టర్

karthik varma dandu next is a mythical thriller

కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు యంగ్ డైరెక్టర్స్. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి థ్రిల్లింగ్ ను ఇచ్చిన సినిమా విరూపాక్ష. కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను అందుకుంది. యాక్సిడెంట్ తర్వాత ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన సాయి తేజ్‌కు ఈ సినిమా సాలిడ్ హిట్ ఖాతాలో పడింది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. కార్తీక మేకింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఈసినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా సాయి ధరమ్ తేజ్ కు కెరీరర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి ఈ ఏడాది హిట్ సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో థ్రిల్లర్ తో రాబోతున్నాడు కార్తీక్ వర్మ. విరూపాక్షకు సుకుమారే స్క్రీన్ ప్లే అందించిన సంగతి తెలిసిందే కదా.. ఇక ఈసినిమాకు కూడా సుకుమారే స్క్రీన్ ప్లే అందించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు విరూపాక్ష సినిమాకు పనిచేసిన సాంకేతిక విభాగమే ఈ కొత్త ప్రాజెక్ట్ కు కూడా పని చేయనున్నారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నట్టు సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఇవ్వనున్నారట. చూద్దాం ఈ థ్రిల్లర్ తో ఎంత థ్రిల్లింగ్ కు గురిచేస్తారో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =