విభిన్నమైన సినిమాలు, ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. ఇక రీసెంట్ గానే శ్రీవిష్ణు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశాడు. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా సామజవరగమన. ఈసినిమా ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మంచి ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దానికితోడు గత వారం రిలీజ్ అయిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడతం ఈసినిమాకు మరింత కలిసొచ్చింది. దీంతో రిలీజ్ అయి మూడో వారంలోకి అడుగుపెడుతున్నా కూడా ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకొని దూసుకుపోతుంది. ఇప్పటికే 40 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకొని త్వరలో 50 కోట్ల క్లబ్ లోకి చేరడానికి సిద్దంగా ఉంది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈసినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టుకోవడం మాములు విషయం కాదు. నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించగా.. ఇంకా వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించగా.. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























