మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే ఈసినిమా నుండి పాటలకు కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే భోళా మేనియా అంటూ మొదటి పాటను రిలీజ్ చయగా.. ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. జాం జాం జజ్జనక అనే సెకండ్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈపాట పార్టీ సెలబ్రేషన్ పాట అని ఇప్పటికే అర్థమవుతుంది. పాటలో చిరుతో కలిసి సుశాంత్, కీర్తి సురేష్, తమన్నా స్టెప్పులేశారు. మొత్తానికి పాట అయితే చాలా కలర్ఫుల్గా, గ్రాండియర్‌గా కనిపిస్తుంది. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా ఆలాపించారు. కాసర్ల శ్యామ్ మాస్ ని ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. మధ్యలో పాపులర్ ఫోక్ నెంబర్ నర్సపల్లెని మిక్స్ చేయడంతో పార్టీ వైబ్ మరొక స్థాయికి వెళ్ళింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: