మహావీరుడు కోసం మాస్ మహారాజా వాయిస్ ఓవర్

Mass Maharaja Ravi Teja Voiceover For Sivakarthikeyan Mahaveerudu movie

కొంతమంది హీరోలు నటిస్తే నటించినట్టు అనిపించదు.. చాలా సహజంగా ఉంటుంది. అయితే అలాంటి హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో తమిళ్ టాలెంటెండ్ నటుడు శివ కార్తికేయన్ పేరు కూడా ఉంటుంది. తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నుండి వస్తున్న సినిమా మహావీరుడు. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. తమిళ్ లో మావిరన్ అనే టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో మహావీరుడు అనే టైటిల్ తో వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఈనెల14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాాకు మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు మేకర్స్ ప్రోమోను విడుదల చేశారు. నిరాశలో ఉన్న శివకార్తికేయన్ ఆకాశం వైపు చూస్తుంటాడు.. అప్పుడు “ధైర్యమే జయం” అంటూ రవితేజ వాయిస్ వినిపించడం ఆసక్తికరంగా వుంది. రవితేజ వాయిస్ ఓవర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.

కాగా ఈ సినిమాలో శివ కార్తికేయన్‌ కు జోడిగా అదితి శంకర్ నటిస్తోంది. ఈసినిమాను శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తుండగా భరత్ శంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్టర్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.