మహేష్ తో నటించడమే డ్రీమ్

my dream is to act with mahesh babu says mrunal thakur

ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సెలబ్రిటీకి ఒక డ్రీమ్ ఉంటుంది. డైరెక్టర్ అయితే పలానా హీరోతో చేయాలని.. హీరో అయితే పలానా డైరెక్టర్ తో చేయాలని.. అలానే హీరోయిన్స్ కు కూడా పలానా హీరోతో చేయాలని అనుకుంటు ఉంటారు. కొంతమందికి అది వర్కవుట్ అవ్వొచ్చు.. కొంతమందికి అది వర్కవుట్ కాకపోవచ్చు. ఇక ఇప్పుడు మృణాల్ కూడా తన డ్రీమ్ ఏంటో చెబుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మృణాల్. అంతకుముందే బాలీవుడ్ లో సినిమాలు చేసినా కూడా పెద్దగాా గుర్తింపు రాలేదు కానీ.. సీతారామం సినిమా మాత్రం తనకు మంచి బ్రేక్ ఇచ్చింది. క్లాసిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమాలో మృణాల్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ అవుతుంది. నాని కెరీర్ లో వస్తున్న 30వ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమా తరువాత విజయ్ దేవరకొండతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈసినిమాను కొద్ది రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు.

అయితే తనకు మాత్రం ఓ హీరోతో చేయడమే డ్రీమ్ అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఆ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ తో సినిమా చేయడమే తనకున్న డ్రీమ్ అని.. దానికోసం రోజూ కలలు కంటున్నా అంటూ చెప్పుకొస్తుంది మృణాల్. మరి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ తో సినిమా చేయాలని ప్రతి హీరోయిన్ కు ఉంటుంది. అయితే మృణాల్ కూడా ఇంకో హిట్ కొట్టిందంటే మహేష్ తో చేసే ఛాన్స్ కూడాా కొట్టేసే అవకాశం లేకపోలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 15 =