ఆర్ఆర్ఆర్ తర్వాత జపాన్ లో కె.జి.యఫ్1, కె.జి.యఫ్2

kgf1 and kgf2 set to release in japan

మన సౌత్ సినిమాల ప్రభావం ఇతర ఇండస్ట్రీలపై ఎంతగా పడిందో చూస్తున్నాం. ప్రస్తుతం అయితే బాలీవుడ్ ను కూడా వెనక్కి నెట్టి సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ ప్రభావం చూపిస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలు అయితే అంతర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. ఇక కొన్ని సినిమాలను విదేశాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లో రిలీజ్ చేయగా అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమాలు సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పుడు మరో ఫ్రాంచైజ్ ప్రభంజనం సృష్టించడానికి సిద్దమవుతుంది. ఆ ఫ్రాంచైజ్ మరేదో కాదు కె.జి.యఫ్1, కె.జి.యఫ్2.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కె.జి.యఫ్1, కె.జి.యఫ్2 సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయో తెలిసిందే కదా. కె.జి.యఫ్ పార్ట్1 ఎటువంటి అంచనాలు లేకుండా 2018లో రిలీజ్ అయింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2022 లో వచ్చిన సెకండ్ పార్ట్ మరింత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈసినిమా జపాన్ లో రిలీజ్ కు సిద్ధంగా. ఈనేపథ్యంలోనే రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జూలై 14 వ తేదీన కె.జి.యఫ్1, కె.జి.యఫ్ 2 చిత్రాలను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరి చూద్దాం ఈసినిమా అక్కడ ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుంది.. ఆర్ఆర్ఆర్ సినిమాను ఈసినిమా బీట్ చేస్తుందా లేదా అన్నది?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =