కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 81

bro movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

బ్రో ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

జులై నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో సినిమా గురించి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి ఈసినిమాపై. ఫైనల్ గా జులై 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు మరేన్నో రోజులు లేదు. మరోవైపు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ. దీనికి తోడు రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి…

TFN Adminవాట్సాప్
baby movie massive collections in 3 days
బాక్సాఫీస్

బేబి మాసివ్ కలెక్షన్స్- అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్

కథలో కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా సక్సెస్ చేస్తామని మరోసారి నిరూపించారు ప్రేక్షకులు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, ఆశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బేబి. ఈసినిమా జులై 14వ తేదీన రిలీజ్ అయి ఎంత హిట్ అయిందో చూస్తూనే ఉన్నాం. అవ్వడానికి చిన్న సినిమానే అయినా ప్రమోషన్స్ మాత్రం భారీగా చేశారు. అందుకే సినిమా రిలీజ్ కు ముందే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడంలో చిత్రయూనిట్ సక్సెస్ అయింది. ఇక రిలీజ్ అయి ఆ అంచనాలను అందుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
intense poster released from vyuham movie
ఫస్ట్ లుక్

వ్యూహం ఇంటెన్స్‌ పోస్టర్‌ విడుదల

రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాను ప్రకటించిన దగ్గరనుండే సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ చేయాలో తనకు తెలుసు. ఇక కొంతకాలంగా రామ్ గోపాల్ వర్మ ఏపీలోని పొలిటికల్ లీడర్స్ పై సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అంతేకాదు ఈసినిమా ఇప్పటికే 50శాతం వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు అలానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Hidimba movie Reverse Action Trailer out
ట్రైలర్ & టీజర్

హిడింబ అదిరిపోయిన రివర్స్ ట్రైలర్

అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వస్తున్న సినిమా హిడింబ. హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో ఎంత విభిన్నత చూపిస్తే సినిమాకు అంత క్రేజ్ పెరిగిపోతుంది. ఇప్పుడు అదే ఫాలో అవుతుంది హిడింబ టీమ్. ఈసినిమా జులై 20వ తేదీన రిలీజ్ కాాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇక్కడే ఒక విశేషం ఉంది. ఈసినిమా నుండి రివర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. టాలీవుడ్‌లో రివర్స్ ట్రైలర్ విడుదల చేయడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పుడు ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ప్రతి సీక్వెన్స్‌ను రివర్స్ ఆర్డర్‌లో…

TFN Adminవాట్సాప్
mass maharaja ravi teja praises on baby movie
సినిమా వార్తలు

బేబి పై మాస్ మహారాజా ప్రశంసలు

ఈమధ్య సెలబ్రిటీలు ఏదైనా హిట్ అయితే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశంసించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. స్టార్ హీరోలు సైతం తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. ఇక తాజాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టి దూసుకుపోతుంది బేబి సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందించింది చిత్రయూనిట్. ఈసినిమా కూడా మౌత్ టాక్ తోనే మంచి ఆదరణను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
ketika sharma shares interesting facts about bro movie
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ అనే ఒక్క పేరు చాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న 'బ్రో'. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమాలో హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈసినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
prabhas project k movie on times square billboard
సినిమా వార్తలు

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై ప్రాజెక్ట్ K

ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రాజెక్ట్ కే గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఈసినిమా నుండి అప్ డేట్స్ రానున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో.. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే కదా ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రాజెక్ట్ కే అనే టైటిల్ తోోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఇంట్రెస్టింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ హైప్ ను పెంచుతున్నారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
ntr devara movie action schedule completed
షూటింగ్ అప్‌డేట్

సముద్రంలో దేవర రక్తపాతం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ అరవింద సమేత సినిమా తరువాత చాలా కాలానికి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. అయితే అది మల్టీస్టారర్ సినిమా. ఈనేపథ్యంలో చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో గా వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాకోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
interesting poster released from venkatesh saindhav movie
ఫస్ట్ లుక్

హార్ట్ ఆఫ్ సైంధవ్- ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్

విక్టరీ వెంకటేష్ కూడా ఇప్పుడు డిఫరెంట్ కథలను ఎంచుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు కేవలం సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే కాకుండాా ఓటీటీలో కూడా చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక ప్రస్తుతం వెంకీ నుండి తెలుగులో వస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
nidhi agerwal interesting post on hari hara veera mallu movie
సినిమా వార్తలు

హరి హర వీరమల్లు తో కల నిజమైంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొదటిసారి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ లో పవన్ నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెండేళ్ల క్రితమే వెళ్లింది. కానీ ఇంతవరకూ రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. ఈసినిమా కంటే వెనుక మొదలుపెట్టిన సినిమాలు కూడా ఇప్పటికే రిలీజ్ అవుతున్నాయి. షూటింగ్ మాత్రం చాలా వరకూ పూర్తి చేసుకుంది. గత కొద్దిరోజులుగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు.

TFN Adminవాట్సాప్
meenakshi chaudhary interesting comments on guntur kaaram movie
సినిమా వార్తలు

గుంటూరు కారంపై మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్ గుంటూరు కారం అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి మహేష్ లోని మాస్ యాంగిల్ ను బయటకు తీసుకురానున్నాడు త్రివిక్రమ్. దానికి రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్సే ఉదాహరణగా చెప్పొచ్చు. మేకోవర్ ను మార్చేసి.. నోట్లో బీడీ పెట్టుకొని మహేష్ మాస్ లుక్ లో అదరగొట్టేశాడు. దీంతో మహేష్ ను ఇంత మాస్ లుక్ లో ఎప్పుడూ చూడకపోవడంతో అటు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
vijay devarakonda will be chief guest for baby movie success
సినిమా వార్తలు

బేబి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి రౌడీ హీరో

ఎలాంటి అంచనాాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్న సినిమాలు ఈమధ్య కాలంలో చాలా ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో సినిమా చేరిపోయింది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బేబి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈసినిమా యూత్ ను బాగా ఆకట్టుకోవడంతో ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ , వైష్ణవి ల నటన, కథ, సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేటి జనరేషన్ లో లవ్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చూపించారు. దీంతో సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Imitates Power Star Pawan Kalyan in Bhola Shankar Movie
సినిమా వార్తలు

'భోళా శంకర్'లో పవర్ స్టార్‌ మేనరిజాన్ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడు 'చిరు లీక్స్' పేరుతో తన సినిమాలకు సంబంధించిన కొన్ని సరదా విషయాలను అభిమానులతో పంచుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజాగా తన రాబోయే చిత్రం 'భోళా శంకర్' గురించి ఒక క్రేజీ అప్‌డేట్‌ను వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ని లీక్ చేశారు. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ తన సోదరుడు, పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ని అనుకరించడం విశేషం. అందులో చిరంజీవి 'తమ్ముడి పాట వస్తుందిలే' అంటూ పవన్ 'ఖుషి' సినిమాలోని ఇంట్రొడక్షన్ సాంగ్ 'యే మేరా జహా' పాటను, అందులో పవన్ మేనరిజాన్ని అనుకరించారు.

Srikanth Mవాట్సాప్
Update on Sitara and Gautams Entry in Film Industry
సినిమా వార్తలు

సితార-గౌతమ్ సినీ ఇండస్ట్రీ ఎంట్రీ కన్ఫామ్

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరో గా రాణిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన చురుకైన నటనతో అప్పట్లోనే ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు తండ్రికి తగ్గ వారుసులుగా తయారవుతున్నారు సితార, గౌతమ్. వీరిద్దరిలో గౌతమ్ కాస్త సైలెంట్ కాగా సితార మాత్రం హైపర్ యాక్టివ్. అందుకే చిన్న వయసులోనే ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఏకంగా బ్రాండ్ అంబాసిడర్ సైతం అయిపోయింది.

TFN Adminవాట్సాప్
kushi shooting wrapped up
షూటింగ్ అప్‌డేట్

ఖుషి షూటింగ్ కంప్లీట్

లైగర్ తరువాత విజయ్ దేవరకొండ,ఖుషితో ప్రేక్షకులముందుకు రానున్నాడు.ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ నేటితో పూర్తయింది.ఈసందర్బంగా చిత్ర బృందం విజయ్ దేవరకొండ చేత కేక్ కట్ చేయించారు.ఇక ఈసినిమాకు సాంగ్స్ ద్వారానే మంచి బజ్ క్రియేట్ అవుతుంది.ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన నా రోజే నువ్వే సాంగ్ పెద్ద హిట్ అవ్వగా మూడు రోజుల క్రితం విడుదలైన ఆరాధ్య సాంగ్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
interesting update on ram charan game changer movie
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్- హీరో, విలన్ పై కీలక సన్నివేశాలు

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుందన్న సంగతి ఇప్పటికే తెలిసిందే. అంతేకాదు అటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఏదో ఒక సందేశం ఇస్తుంటాడు శంకర్. దీంతోనే ఈసారి రామ్ చరణ్ తో ఎలాంటి సందేశం ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈమధ్య ఒక నెలరోజులపాటు ఈసినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. అయితే రీసెంట్ గానే మళ్లీ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు శంకర్ తెలిపాడు. భారీ ఫైట్ సీక్వెన్స్ తో షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు తెలిపాడు.

TFN Adminవాట్సాప్
Naa Nee Premakatha Trailer out now
ట్రైలర్ & టీజర్

నా.. నీ ప్రేమ కథ ట్రైలర్ రిలీజ్

అముద శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా వస్తున్న సినమా ‘నా.. నీ ప్రేమ కథ’. ప్రేమకథగా రాబోతున్న ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు.

TFN Adminవాట్సాప్
ram charan and upasana daughter klin kaara konidela forest theme nurse
సినిమా వార్తలు

మెగా ప్రిన్సెస్ కోసం మెగా నర్సరీ

మెగాప్రిన్సెస్ అంటే మాములు గా ఉండదు కదా. తన విషయంలో ప్రతీది ప్రత్యేకంగానే ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల వివాహం 2012లో జరిగింది. ఇక ఈవీరి వివాహం జరిగిన 11ఏళ్ల తరువాత ఉపాసన ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ తరుణం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ చరణ్ తండ్రి అవ్వడంతో సంబరాలు జరుపుకున్నారు. మరి తాత మెగాస్టార్ చిరంజీవి, తండ్రి మెగా పవర్ స్టార్, తల్లి అపోలో ఆస్పత్రి వ్యవహరాలకు సంబంధించిన బాధ్యతలు నెరవేర్చుతుంది.. మరి అలాంటి వారసురాలి విషయంలో ఏ చిన్న విషయమైన ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటికే తన పేరును క్లిన్ కారా గా ఫిక్స్ చేసి రీసెంట్ గా ప్రకటించిన సంగతి…

TFN Adminవాట్సాప్
sai pallavi emotional post on amarnath yatra
సినిమా వార్తలు

సాయి పల్లవి అమర్నాథ్ యాత్ర- ఎమోషనల్ పోస్ట్

టాలెంటెడ్ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.డ్యాన్స్‌, యాక్టింగ్ స్కిల్స్‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ‌. మలయాళ చిత్రం “ప్రేమమ్” తో హీరోయిన్ గా సిల్వర్ కు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత “ఫిదా” తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు బెస్ట్ హిట్ ను అందుకుంది. ఆతరువాత “ఎంసీఏ” తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ ను అందుకుంది. ఆ తరువాత పలు సినిమాలను చేసి లేడి పవర్ స్టార్ అని పిలిపించుకునే రేంజ్ కు ఎదిగింది.

TFN Adminవాట్సాప్
bro second single out now
సాంగ్

బ్రో సెకండ్ సాంగ్ రిలీజ్

పవన్ కళ్యాణ్,సాయి తేజ్ కలిసి నటించిన బ్రో విడుదలకు సిద్దమవుతుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ఆడియో లోని సాంగ్స్ ను ఒక్కొక్కటి గా రిలీజ్ చేస్తున్నారు.ఇటీవల ఈసినిమా నుండి మొదటి పాట మై డియర్ మార్కండేయ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇప్పుడు రెండో సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.తిరుపతిలోని ఎన్ వి ఆర్ జయశ్యాం థియేటర్లో సాయి తేజ్ ఈసాంగ్ లాంచ్ చేశాడు.జాణవులే అంటూ సాగే ఈ పాటను సాయి తేజ్,కేతిక శర్మ ఫై చిత్రీకరించారు.ఇక ఈసాంగ్ బాగుంది.కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్,ప్రణతి ఈసాంగ్ ను పాడారు.

Mahender Reddyవాట్సాప్

షేర్