కథలో కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా సక్సెస్ చేస్తామని మరోసారి నిరూపించారు ప్రేక్షకులు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, ఆశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బేబి. ఈసినిమా జులై 14వ తేదీన రిలీజ్ అయి ఎంత హిట్ అయిందో చూస్తూనే ఉన్నాం. అవ్వడానికి చిన్న సినిమానే అయినా ప్రమోషన్స్ మాత్రం భారీగా చేశారు. అందుకే సినిమా రిలీజ్ కు ముందే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడంలో చిత్రయూనిట్ సక్సెస్ అయింది. ఇక రిలీజ్ అయి ఆ అంచనాలను అందుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, అశ్విన్ విరాజ్ ల నటన ఈసినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. యూత్ ఫుల్ లవ్ స్టోరీ అందులోనూ ఈమధ్య కాలంలో ప్రేమలు ఎలా ఉంటున్నాయో తెలియచేస్తూ తీసిన సినిమా కావడంతో యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందిస్తుంది. మొదటిరోజే ఈసినిమా 7 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా 23 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఒక్క నైజాం లోనే ఈసినిమా దాదాపు 8కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. అంతేకాదు మూడు రోజుల్లోనే ఈసినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ చేసింది. ఫస్ట్ వీకెండ్ లోపు కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు మేకర్స్.
కాగా ఈసినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. సినిమాకు విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించారు. కాగా సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఎడిటర్ గా విప్లవ్ నైషధం పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: