సాయి పల్లవి అమర్నాథ్ యాత్ర- ఎమోషనల్ పోస్ట్

sai pallavi emotional post on amarnath yatra

టాలెంటెడ్ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.డ్యాన్స్‌, యాక్టింగ్ స్కిల్స్‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ‌. మలయాళ చిత్రం “ప్రేమమ్” తో హీరోయిన్ గా సిల్వర్ కు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత “ఫిదా” తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు బెస్ట్ హిట్ ను అందుకుంది. ఆతరువాత “ఎంసీఏ” తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ ను అందుకుంది. ఆ తరువాత పలు సినిమాలను చేసి లేడి పవర్ స్టార్ అని పిలిపించుకునే రేంజ్ కు ఎదిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా సాయి పల్లవి ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే గత కొద్దిరోజులుగా దీనికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఈ యాత్ర గురించి ఎమోషనల్ పోస్ట్ చేసింది సాయిపల్లవి. నిజానికి నేను ఎప్పుడూ నా పర్సనల్ విషయాలను షేర్ చేసుకోను.. కానీ ఇప్పుడు ఈ యాత్ర గురించి చెప్పాలనుకుంటున్నా.. అరవై ఏళ్లు వచ్చిన తల్లిదండ్రులతో ఇలా యాత్రకు తీసుకురావడం మాటల్లో చెప్పలేను. కొండలు, గుట్టలు ఎక్కలేక, నడవలేక ఇబ్బంది పడుతూ.. ఆయసపడుతూ.. ఊపిరి బిగపట్టుకుని మంచులో నడుస్తుంటే.. దేవుడా నువ్వు ఎందుకు ఇంత దూరంలో ఉన్నావు అనిపించింది.

అయితే దర్శనం తరువాత నా ప్రశ్నకు సమాధానం దొరికింది.. కొండలు దిగుతూ యాత్రికులు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తున్నారు. అందరికీ ఎనర్జీ వచ్చేసింది. ఆ యాత్రలో మెుత్తం ఆ నామమే మారుమోగింది.ఇక ఎంతో మంది భక్తుల కోసం ఈ యాత్రను సురక్షితంగా నిర్వహిస్తున్న బోర్డుకు ధన్యవదాలు. ఎలాంటి స్వార్థం లేకుండా పని చేస్తున్న ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసులకు థాంక్స్. మనల్ని ఎల్లప్పుడు కాపాడుతూనే ఉంటారు. నిస్వార్థంగా సేవ చేస్తున్న స్థలం కాబట్టే.. దీనికి గొప్ప పేరు వచ్చింది. నా విల్ పవర్ ను అమర్ నాథ్ యాత్ర ఛాలెంజ్ చేసింది. నన్ను, నా శరీరాన్ని పరీక్షించింది. జీవితమంటేనే ఓ యాత్ర అని చూపించింది. ఒకరికొకరు సాయం లేకుంటే.. జీవితమనే యాత్రలో చచ్చిపోతాం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seven =