అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వస్తున్న సినిమా హిడింబ. హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో ఎంత విభిన్నత చూపిస్తే సినిమాకు అంత క్రేజ్ పెరిగిపోతుంది. ఇప్పుడు అదే ఫాలో అవుతుంది హిడింబ టీమ్. ఈసినిమా జులై 20వ తేదీన రిలీజ్ కాాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇక్కడే ఒక విశేషం ఉంది. ఈసినిమా నుండి రివర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. టాలీవుడ్‌లో రివర్స్ ట్రైలర్ విడుదల చేయడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పుడు ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ప్రతి సీక్వెన్స్‌ను రివర్స్ ఆర్డర్‌లో ప్రజంట్ చేసిన ఈ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండు వేర్వేరు టైమ్ లైన్స్ లో కథ అద్భుతంగా చూపించారు. యూనిక్ థాట్ తో సరికొత్తగా ట్రైలర్ ని ప్రజంట్ చేసిన చిత్ర యూనిట్ ని అభినందించాలి. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు, ట్రైలర్ సినిమాలోని రొమాంటిక్, ఇతర అంశాలను కూడా చూపించింది. ఎడిటర్ ఎమ్ ఆర్ వర్మ ట్రైలర్‌ను చాలా అద్భుతంగా కట్ చేశారు. వికాస్ బాదిసా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ గా ఉంది.బి రాజశేఖర్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రం విజువల్స్ బాగున్నాయి. మరో 3 రోజుల్లో రాబోతున్న హిడింబ పై రివర్స్ ట్రైలర్ మరింతగా అంచనాలని పెంచింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: